Quick and Delicious Mutton Fry Recipe : మటన్​ని చాలామంది ఇష్టంగా తింటారు. అయితే దీనిని చాలా రకాలుగా చేసుకుంటారు. కానీ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ శ్రమ లేకుండా టేస్టీగా, ఘుమఘుమలాడే మటన్ ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ టేస్టీ మటన్ ఫ్రై రెసిపీని ట్రై చేయాల్సిందే. దీనిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

మటన్ - అరకిలో (బోన్ లెస్)

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

Continues below advertisement

కారం - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - 1 టేబుల్ స్పూన్

జీలకర్ర పొడి - 1 స్పూన్

ధనియాల పొడి - 1 స్పూన్

పసుపు - టీస్పూన్

మసాల కోసం

ధనియాలు - 1 స్పూన్

యాలకులు - 4

లవంగాలు - 6

దాల్చిన చెక్క - ఒక అంగుళం

వెలుల్లి రెబ్బలు - 10

మటన్ ఫ్రై కోసం

నూనె - 2 టేబుల్ స్పూన్లు

కారం - 1 టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

వేయించిన ఉల్లిపాయలు - 1 కప్పు

పచ్చిమిర్చి - 4

కరివేపాకు - 2 రెబ్బలు

కొత్తిమీర - గుప్పెడు తురుము

తయారీ విధానం

ముందుగా మటన్ బాగా వాష్ చేసుకుని.. కుక్కర్​లోకి తీసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. మరోసారి కలిపి.. మటన్ ఉడికేందుకు సరిపడా నీళ్లు పోయాలి. ఈ మటన్ 4 లేదా 5 విజిల్స్ వేయించుకోవాలి. 

ఇప్పుడు మటన్ ఫ్రై కోసం మసాలా సిద్ధం చేసుకోవాలి. దీనికోసం ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క తీసుకుని దంచుకోవాలి. దానిలోనే వెల్లుల్లి కూడా వేసి పేస్ట్​గా చేసుకోవాలి. ఈలోపు మటన్ ఉడికిపోతే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి మీడియం మంట మీద.. కుక్కర్లో ఉన్న మిగిలిన నీరు ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. నీరు మొత్తం ఆవిరైపోయాక స్టౌవ్ ఆపేయాలి. 

స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేయాలి. అది వేడి అయ్యాక ఉడికించిన మటన్ వేసి మగ్గనివ్వాలి. కారం, ఉప్పు వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు.. ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి బాగా కలపాలి. స్టౌవ్ ఆపేసి కొత్తిమీర వేస్తే.. ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెడీ. 

చాలా సింపుల్​గా, తక్కువ సమయంలో, ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోగలిగే ఈ మటన్ ఫ్రైనీ రైస్, రోటీల్లోకి చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ​కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీని మీరు కూడా ట్రై చేసి.. హాయిగా లాగించేయండి. 

మరిన్ని ట్రెడీషనల్, టేస్టీ రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.