Tasty Soya Chunks Recipe : నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో దాదాపు అందరూ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం కోసం చూస్తున్నారు. అలాంటివారికి మీల్‌మేకర్స్ (సోయా చంక్స్) మంచి ఎంపిక కావచ్చు. ఇది తినడానికి రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోయా చంక్స్ ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శక్తిని అందించడానికి హెల్ప్ చేస్తాయి. ఇది త్వరగా జీర్ణమవుతుంది. అన్ని వయసుల వారికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.
సోయా చంక్స్ గొప్పదనం ఏమిటంటే.. దీనిని వండుకోవడం చాలా సులభం. ఈజీగా కుక్ చేసుకోవచ్చు. వర్క్ ఉన్న రోజుల్లో కూడా ఆరోగ్యకరంగా, రుచికరంగా తినాలనుకుంటే మీరు సోయా చంక్స్ తీసుకోవచ్చు. దీనిలో కాస్త మసాలా వేస్తే మరింత రుచిగా మారుతుంది. అలాగే చిక్కటి గ్రేవీ టేస్ట్‌ని మెరుగుపరుస్తుంది. మరి టేస్టీగా, హెల్తీగా మిల్‌మేకర్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
మీల్ మేకర్ కూర రెసిపీ.. టేస్టీగా, ఈజీగా
సోయా చంక్స్ కూరను టేస్టీగా చేయడానికి ముందుగా సోయా చంక్స్‌ను వేడి నీటిలో వేయాలి. దానిలో కాస్త ఉప్పు వేసి.. 10 నుంచి 12 నిమిషాల పాటు నానబెట్టండి. కానీ తరువాత వాటిలోని అదనపు నీరు పోయేలా చంక్స్‌ను బాగా పిండేయాలి. ఇప్పుడు వాటిని వేరే గిన్నెలో ఉంచండి. పెరుగు, పసుపు, కారం, ధనియాల-జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. వీటిని 5 నిమిషాలు మెరినేట్ చేయండి.
ఇప్పుడు మిక్సర్‌లో ఉల్లిపాయలు, టొమాటోలు, నానబెట్టిన ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, 1 నుంచి 4 కప్పుల నీరు వేయండి. బాగా రుబ్బి మెత్తని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయండి. కొన్ని సెకన్ల తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించాలి. ఇప్పుడు మెరినేట్ చేసిన సోయా చంక్స్ వేసి.. ఉప్పులో 3 నుంచి 4 కప్పుల వేడి నీరు వేసి మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించాలి.
కర్రీ ఉడికిన తర్వాత కసూరి మెంతి, కొత్తిమీర వేసి కొద్దిగా కలపండి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన సోయా చంక్స్ మసాలా కర్రీ రెడీ. దీనిని వేడి వేడిగా రోటీ లేదా అన్నంతో కలిపి వడ్డించండి. సోయా చంక్స్‌లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును నియంత్రించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియకు కూడా మంచిది. శాఖాహారులు ప్రోటీన్ కోసం దీనిని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.