Vadalu Recipe with Bread : మసాలా వడలు అంటే శనగపప్పుతో ఎక్కువగా చేసుకుంటారు. అయితే మీరు టేస్టీ, క్రంచీ మసాలా వడలు ఇన్‌స్టాంట్‌గా తినాలనుకుంటే మీరు బ్రెడ్‌తో వాటిని తయారు చేసుకోవచ్చు. మీరు ఛాయ్ లవర్ అయితే దానికి మీకు పర్ఫెక్ట్ స్నాక్ దొరికేసినట్టే. దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా ఈవెనింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చు. పిల్లలకు స్కూల్ కోసం కూడా వీటిని తయారు చేసి పెట్టవచ్చు. వీటిలోని కూరగాయలు టేస్ట్‌తో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఈ బ్రెడ్ మసాలా వడలను ఏవిధంగా తయారు చేయాలో? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బ్రెడ్ - 3
క్యారెట్ - 1
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
పుదీనా - కొంచెం
కొత్తిమీర - కొంచెం
అల్లం - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - ఫ్రైకి సరిపడేంత
తయారీ విధానం
ముందుగా క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం బాగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా, తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ గిన్నె తీసుకుని దానిలో బ్రెడ్‌ను ముక్కలుగా చేసి వేయాలి. దానిలో అల్లం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. కూరగాయల్లోని నీరు సరిపోకపోతే.. కాస్త నీరు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో బియ్యం పిండి వేసి మరోసారి బాగా కలపాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి..కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి వేడిచేయండి. ముందు తయారు చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా వత్తుకోవాలి. అయితే బాగా ఉబ్బినట్లు కాకుండా కాస్త పలుచగా ఉండేట్లు వత్తుకోవాలి. ఇలా చేస్తే వడలు రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని వేడి అయిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టౌవ్ మంట మీడియంలో ఉండేలా చూసుకోండి.
బ్రెడ్ త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి.. స్టౌవ్ దగ్గరే ఉంటే మంచిది. లేకుంటే మాడిపోయే అవకాశముంది. ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు వాటిని తిప్పి ఫ్రై చేయండి. రెండువైపులా గోల్డెన్ కలర్లో వచ్చాక వాటిని తీసేసి.. టిష్యూ మీద ప్లేస్ చేయండి. వడల్లోని నూనెను టిష్యూలు పీల్చుకుంటాయి. అంతే వేడి వేడి క్రంచీ బ్రెడ్ వడలు రెడీ. వీటిని మీరు సాస్‌తో లేదా ఉదయాన్నే అల్లం ఛాయ్‌తో హాయిగా లాగించేయవచ్చు. ఇవి కేవలం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా ఈవెనింగ్ స్నాక్స్‌గా కూడా మీరు తయారు చేసుకోవచ్చు.
మీరు బ్రెడ్ వడలను డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో వండాలి అనుకుంటే దానిని 390 ఎఫ్ వద్ద 15 నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. పిండితో వడలు వత్తుకుని వాటికి రెండు వైపులా ఆయిల్ అప్లై చేయాలి. వాటిని బాస్కెట్లో ఉంచి ఎయిర్ ఫ్రైయర్లో 12 నిమిషాలు ఫ్రై చేయాలి. మరోవైపు తిప్పి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. వీటిని మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఓవెన్‌ను 400 ఎఫ్ వద్ద 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకుని..15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
Also Read : పిల్లలు హెల్తీగా బరువు పెరిగేందుకు రాగులను ఇలా చేసి తినిపించండి