Sushmita Sen Net Worth and Properties : నటి సుష్మితా సేన్ తన ప్రతిభతో, కష్టం ద్వారా బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మిస్ యూనివర్స్ (1994) అయిన ఈ భామ గురించి చాలామందికి తెలుసు. తెలుగులో కూడా సుపరిచితురాలే. ఈరోజు ఆమె తన 50వ పుట్టినరోజు(Sushmita Sen 50th Birthday)ను జరుపుకుంటుంది. కెరీర్లో మంచి సక్సెస్ చూసిన ఈ నటి లైఫ్‌స్టైల్ ఎలా ఉందో.. ఆమె నికరు ఆస్తులు ఏంటో.. వంద కోట్ల ఆస్తిని ఆమె ఎలా సంపాదించిందో చూసేద్దాం.
సుష్మితా సేన్ నికర ఆస్తులు
GQ ఇండియా నివేదిక ప్రకారం.. సుష్మితా సేన్ నికర ఆస్తులు దాదాపు 100 కోట్ల రూపాయలు. ఆమె నటనతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, పెట్టుబడుల ద్వారా మంచిగా సంపాదిస్తుంది. సుష్మితాకు ముంబైలో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. దీనితో పాటు ఆమెకు ముంబైలో కూడా మరో ప్రోపర్టీ ఉంది. కేవలం ఇండియాలోనే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా ఆమెకు ఆస్తులు ఉన్నాయి. సుష్మితా సేన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం 60 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందని సమాచారం.
సుష్మితా సేన్ వ్యాపారాలు
సుష్మితా సేన్‌కు దుబాయ్‌లో ఒక జ్యూవెలరీ స్టోర్ ఉంది. అంతేకాకుండా ఆమెకు ఓ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. దానిపేరు తంత్ర ఎంటర్‌టైన్‌మెంట్. దీనితో పాటు ఆమె సెసాజియోని అనే కంపెనీకి యజమాని. ఈ కంపెనీ స్పా సెంటర్లు, హోటళ్లపై పనిచేస్తుంది.
సుష్మితా సేన్ లగ్జరీ కార్ల లిస్ట్ ఇదే
సుష్మితాకు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె కార్ల సేకరణ గురించి మాట్లాడితే.. ఆమెకు మెర్సిడెస్ AMG GLE53 కూపే, BMW 7 సిరీస్ 730Ld, లెక్సస్ LX 470, BMWX6, ఆడి Q7, ఫియట్ లీనియా వంటి కార్లు ఉన్నాయి.
సుష్మితా సేన్ పెళ్లి చేసుకోలేదు కానీ ఆమె ఇద్దరు కుమార్తెలను పెంచుతుంది. దత్తత ద్వారా రెనే, అలీషా పెంచుకుంటుంది. ప్రస్తుతం సుష్మితా తన పనిపై, కుమార్తెల పెంపకంపై పూర్తి దృష్టి పెడుతుంది. కుమార్తెలతో వెకేషన్లకు వెళ్లి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. సుస్మిత సేన్ గతంలో లవ్ రిలేషన్లో ఉంది కానీ.. అవి ఎక్కువకాలం సాగలేదు.