గుండె నిండా గుడి గంటలు నవంబర్ 18 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 18th Episode
సుశీలమ్మ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి మురిసిపోతుంది మీనా. నీకు బంగారం అంటే మోజు లేదు కదా అంటాడు బాలు. దీన్ని బంగారంగా భావించడం లేదు.. తరతరాలుగా వచ్చిన గౌరవంగా భావిస్తున్నా అంటుంది మీనా. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బీరువా లాకర్లో పెట్టాలి. లేదంటే ఇంట్లో బంగారం మార్చేసినట్టే దీన్ని కూడా మార్చేస్తారు అంటాడు బాలు. ఈ విషయాన్ని వదిలిపెట్టను అంటాడు బాలు. అమ్మమ్మ ఊరెళ్లేవరకూ ఆగండి ఆ తర్వాత మాట్లాడుదాం అంటుంది. సరే అగుతాడు బాలు. ఈయన ఇప్పుడే ఇలా ఉన్నాడు..రేపు ఇంకెలా ఉంటాడో అని భయపడుతుంది మీనా.
ఇంటికి వెళ్లిన మౌనికను నిలదీస్తాడు సంజూ. ఎన్నిసార్లు అడిగినా నేను గుడికే వెళ్లాను అని స్ట్రాంగ్ గా చెబుతుంది. మీ ఇంటికి వెళ్లావ్ కదా అని సంజూ అడుగుతాడు. లేదండీ అత్తయ్యగారికి కూడా చెప్పాను అంటుంది. మా అమ్మే చెప్పింది నువ్వు గుడికి వెళ్లమని అంటాడు మౌనిక. అదేంట్రా అలా చెబుతావ్..గుడికి వెళ్లిందని చెప్పాను కదా అని సంజూ మాట కొట్టిపడేస్తుంది మౌనిక అత్త. ప్రతిసారీ దేవుడే నిన్ను కాపాడుతున్నాడు..ఈసారి నానుంచి తప్పించుకోలేవ్ అనేసి వెళ్లిపోతాడు. హమ్మయ్య ఈ గండం గడిచింది అనుకుంటుంది సంజూ తల్లి. అంతా సంతోషంగా గడిచిందా అని అడిగితే.. అవును..కాసేపు ఉంటే బావుండేది అనిపించింది కానీ ...ఇక్కడ పరిస్థితి బాలేదని వచ్చేశాను అంటుంది. అయినా మీరు ధైర్యం చేసిన నన్ను పంపించారు సంతోషం అంటుంది
సుశీలమ్మను ఊరు తీసుకెళ్లేందుకు కార్లో తీసుకెళ్తాడు బాలు. బర్త్ డే ఎలా జరిగిందో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బస్ ఎక్కేందుకు వెళుతూ.. నువ్వు మీనా గొడవపడ్డారా? మీ అమ్మ ఏదైనా అందా? అని వరుస ప్రశ్నలు వేస్తుంది. అదేం లేదు అంటాడు. మరి మీ ఇద్దరి ముఖాల్లో ఏదో వెలితి కనిపిస్తోంది అందుకే అడిగా అంటుంది. నీకు బంగారం చైన్ కొనిద్దాం అనుకున్నాం మీనా-నేను...అది కుదర్లేదు అందుకే ఈ బాధ అంటాడు బాలు. అంతకన్నా పెద్ద బహుమతి ఇచ్చావ్..ఇంతకన్నా ఆనందం నాకేముంది అంటుంది సుశీలమ్మ. నీకు మరో విషయం చెప్పాలి అంటుంది. నీ అత్తారింట్లో మావయ్య లేరు..నీ భార్యకు చెల్లెలు ఉంది కదా..దానికి పెళ్లిచేసే బాధ్యత నీదే అంటుంది. మీనా తమ్ముడు చిన్న పిల్లాడే కాబట్టి తొందరలేదు అంటుంది. వాడో పెద్ద ముదురు అని చెబుతాడు బాలు. ఆ కుటుంబానికి అన్నీ నువ్వై చూసుకోవాలి అని బోధిస్తుంది
ఇంటికి రావడంతోనే...గేట్ కి లాక్ వేసి మరీ వస్తాడు బాలు. మనోజ్ బయటకు వెళుతుంటే..ఆగు పనుందని ఆపుతాడు. మాకు లేట్ అవుతోందని రోహిణి అంటుంది..నేను డ్రైవర్ ని కాదురా అని మనోజ్ అంటే..అవునురా దొంగవి అంటాడు. ఏమైందని అడుగుతారంతా.. మీ ఆయనకు ఏమవుతుందో చూడాలి అంటాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది. ఏం జరిగిందని సత్యం అడుగుతాడు. బామ్మ వెళ్లేవరకూ ఆగాలని ఓపికపట్టాను...ఈ తల్లి కొడుకులు వేసిన తైతెక్కలు బయటపెట్టకుండా బలవంతంగా ఆగాను అంటాడు. మీనా వెళ్లి ఈ తల్లి కొడుకుల గుట్టుని గుప్పెట్లో పట్టుకునిరా అంటాడు. అత్తా కోడలు ఇల్లు మింగాలని చూశారు..అది రూట్ మార్చి.. ఇప్పుడు తల్లి కొడుకులు మోసాలు మొదలుపెట్టారు అంటాడు బాలు.
ఇవి మీనా నగలే కదా అని సత్యం అడిగితే.. అవును నాన్నా కానీ కాదు అంటాడు బాలు. మార్చేశారు మావయ్యా...బంగారు నగలు మార్చేసి గిల్ట్ నగలు పెట్టారు అని చెప్పేస్తుంది మీనా. మీ కళ్లముందే నా వంటిమీద నగలు వలిచి ఎవరికిచ్చాను అంటుంది మీనా... దీనికే అని ప్రభావతిని చూపిస్తాడు సత్యం. నేను పుస్తెలతాడుతో సహా తీసిచ్చాను..నాకు తిరిగి ఇచ్చినప్పుడు గోల్డ్ కవరింగ్ నగలు ఇచ్చారు అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి ఫైర్ అవుతుంది. బామ్మకు చైన్ కొనాలని ఈ నగలు తాకట్టుపెట్టడానికి బంగారు షాప్ కి వెళితే.. వాళ్లు గెంటేశారు.. పోలీసులకు ఫిర్యాదు ఇస్తామన్నారు. చేయని తప్పుకి చచ్చిపోయాం..వీళ్లిద్దరూ ఎంత ధైర్యంగా నిలబడ్డారో చూడండి అంటాడు. ఈ విషయం అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని సత్యం అడుగుతాడు...అమ్మమ్మగారి పుట్టినరోజు గొడవ ఎందుకని నేను ఈయన్ని ఆపుతూ వచ్చాను. సత్యం అడిగినప్పుడు కూడా ప్రభావతి బయటపడదు. నాకేం తెలియదు అనేస్తుంది. మేం బంగారం ఇస్తే మీరు గిల్ట్ నగలు ఇచ్చి తెలియదు అంటే ఏంటి అర్థం అంటుంది మీనా. ఎస్..అప్పుడు నేను కూడా ఉన్నాను అంటుంది శ్రుతి. ఈ నగలు అది నాకు ఇచ్చినప్పుడే గిల్ట్ నగలు ఎందుకు కాకూడదు అంటుంది. మీనానే వాళ్ల పుట్టింటివాళ్లకి ఇచ్చేసి ఉండొచ్చు అనే నింద వేస్తుంది..
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?