Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన రాహుల్‌ను ధాన్యలక్ష్మీ మరో కొత్త నాటకం మొదులు పెట్టావా అంటుంది. ఆ మాటలకు స్వప్న బాధపడుతుంది. ఇంతలో సుభాష్ వస్తాడు.
సుభాష్: రాహుల్ చెప్తుంది నిజమే డబ్బుల కోసం రాహుల్ దొంగల చేతుల్లో దెబ్బలు తినడం నేను చూశాను. అక్కడ రాహుల్ పరిస్థితి చూసి నేను డబ్బులు పోయాయేమో అనుకన్నాను. కానీ ఆ డబ్బులను కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు
స్వప్న: ఇప్పుడేమంటారు మీరంతా ఇంకా నా భర్త దొంగలా నేరస్థుడిలా కనిపిస్తున్నాడా మీకు ఏం ఆంటీ మాట్లాడరేంటి.? నోరు రావడం లేదా.? లేక సుభాష్ అంకుల్ చెప్పింది కూడా నాటకం అంటారా..?
ధాన్యలక్ష్మీ: ఇది మరీ బాగుంది స్వప్న.. ఇరవై లక్షల డబ్బులు డ్రా చేసిన వాడు సరైన టైంలో టెండర్ ఆఫీసుకు వెళ్లకపోతే ఏమనుకుంటాం.? నీ భర్త గతాన్ని చూస్తే అనుమానించకుండా ఎలా ఉంటాము
స్వప్న: మారిన మనషి గురించి ఆలోచించకుండా.. అవతల ఏం జరిగిందో తెలుసుకోకుండా మనుషుల మీద నిందలు వేసి అవమానించడం కాదు. మీరంతా చూడాల్సింది నా భర్త గతాన్ని కాదు మనిషిగా మారాలనుకున్న అతని అభిమతాన్ని. మారిన మనిషిని మీరు గమనించరు..? అతని కనీసం ఒక మనిషిగా పరిగణించరు..? రెప్పపాటు కాలం కూడా అతన్ని నమ్మకపోతే అతను ఎలా మారతాడు
రుద్రాణి: అదంతా వాళ్లకు ఎందుకు స్వప్న నా కొడుకును అవమానించాలి. వాడు నా కడుపున పుట్టినందుకు వాళ్లు నన్ను నిందించాలి. అంతే అంతే తెలుసు వాళ్లకు.. గతంలో తప్పులు చేసిందే కనిపిస్తుంది కానీ ఇప్పుడు వాడు మారి.. ప్రాణాలను పణంగా పెట్టి డబ్బులు తెచ్చాడే అది ఎవ్వరికీ కనిపించదు..
రాహుల్: మమ్మీ నువ్వేం మాట్లాడకు.. ఇంట్లో వాళ్లు ఎవర్ని ఒక్క మాట కూడా అనే హక్కు నీకు లేదు..
రుద్రాణి: రాహుల్ ఏం మాట్లాడుతున్నావు..?
రాహుల్: అవును మమ్మీ వాళ్లు నన్ను అనుమానించడంలో తప్పు లేదు. గతంలో నేను చేసిన పనులు అలాంటివి.. నన్ను నేను ఫ్రూవ్ చేసుకుంటున్నాను.. ఇందులో నువ్వు కలగజేసుకోవద్దు..
అపర్ణ, ధాన్యలక్ష్మీ: డబ్బు తెచ్చావు కానీ కాంట్రాక్ట్ పోయింది కదా..?
రాహుల్: అవును డబ్బు తెచ్చాను కాంట్రాక్ట్ పోయింది అందుకే రాజ్‌ను క్షమాపణ అడుగుతున్నాను.
రాజ్: రాహుల్ నువ్వేం బాధపడకు..కాంట్రాక్ట్ ఏమీ పోలేదు మనకే వచ్చింది.
అందరూ షాక్.. అవుతూ కాంట్రాక్ట్ వచ్చిందా..? ఎలా వచ్చింది అని అడగ్గానే.. జరిగింది మొత్తం చెప్తాడు రాజ్. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత స్వప్న రాహుల్ దగ్గరకు వెళ్తుంది.
స్వప్న: ఎందుకు ఇంత రిస్క్ చేశావు రాహుల్
రాహుల్: నేను ఇప్పుడు ఈ రిస్క్ చేయకపోతే నన్ను ఎవ్వరూ కూడా జీవితంలో నమ్మేవారు కాదు..
స్వప్న: ఇక నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను రాహుల్
రాహుల్: థాంక్యూ స్వప్న థాంక్యూ.. వెరీమచ్.. నువ్వు నమ్మితే చాలు నాకు సంతోషంగా ఉంది. ఇక జీవితంలో నిన్ను ఎప్పుడు బాధపెట్టను స్వప్న.. జీవితంలో నాకు దొరికిన అదృష్టానివి స్వప్న
అంటూ ఎమోషనల్ అవుతుంటాడు. ఇక రాజ్‌తో కావ్య కూడా రాహుల్ చాలా మారిపోయాడని ఇంకో చాన్స్ ఇవ్వాలని చెప్తుంది. అందుకు మొదట ఒప్పుకోని రాజ్‌ను కావ్య కన్వీన్స్ చేసి ఒప్పిస్తుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. రాహుల్ భోజనానికి రాలేదని రాజ్ పిలుస్తాడు. రాహుల్ రాగానే.. నీ జీవితానికి సంబంధించిన విషయం మాట్లాడాలి అంటాడు రాజ్. దీంతో అందరూ ఆశ్చర్యంగా రాజ్‌ను చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!