కొవ్వుని కరిగించుకుని నాజూకు శరీరం పొందాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది చక్కని ఎంపిక. తాజాగా వచ్చిన అధ్యయనం ప్రకారం యాలకులు మీ కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిరూపితమైంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. పలు ప్రాంతాల్లో యాలకులు ప్రసిద్ధి చెందిన మసాలాగా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని ‘క్వీన్ ఆఫ్ స్పైసెస్’ అని పిలుస్తారు. టెక్సాస్ ఏ అండ్ ఏం కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ పరిశోధకులు ఈ మసాలాను సూపర్ ఫుడ్ గా అభివర్ణించారు.


ఈ చిన్న మసాలా కేలరీలని బర్న్ చేయగలదు. ఆకలిని పెంచగలదు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం దీన్ని రోజువారీ డైట్లో తీసుకుంటే మంచిది. ఇవి ఆకలిని పెంచుతాయని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే కొవ్వుని కరిగించే శక్తి వీటికి ఉంది. యాలకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి బయట పడేస్తుంది. ఇందులోని విటమిన్ సి సీజనల్ వ్యాధులైన జలుబు, ఫ్లూ, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పిగా అనిపించినప్పుడు కాస్త యాలకులు నోట్లో వేసుకుని నమిలితే మంచి రిలీఫ్ లభిస్తుంది.


ఎంత అవసరం?


పరిశోధకుల అంచనా ప్రకారం పెద్దవారికి కనీసం 77 మిల్లీ గ్రాముల యాలకులు తీసుకుంటే మంచిది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి పది యాలకులు తీసుకోవడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు. కాలేయం, కండరాలలో పేరుకుపోయిన కణజాల కొవ్వు లిపోలిసిస్ ని తగ్గిస్తుంది. జీవక్రియని నియంత్రిస్తుంది. వీటిలో శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయని తాజా పరిశోధన సూచిస్తుంది. తక్కువ స్థాయి మంటని తగ్గిస్తుంది. కానీ దీర్ఘకాలిక మంటని, అనేక రకాల వ్యాధుల అభివృద్ధికి దారి తీస్తుందని తాజా పరిశోధన వెల్లడిస్తుంది.


యాలకులు బరువు తగ్గడానికి సహాయపడతాయని తేలింది. రక్తపోటుని అదుపులో ఉంచే గుణాలు ఇందులో ఉన్నాయి. నిద్రపోయే ముందు యాలకులు, పాలు కలుపుకుని తాగితే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాల్షియం ఉండటం వల్ల ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తుంది. కీళ్ల నొప్పులు దరిచేరకుండా అడ్డుకుంటుంది. 


యాలకుల ప్రయోజనాలు


☀ యాలకులు జీర్ణక్రియకి సహాయపడే ఎంజైమ్లని ప్రేరేపిస్తాయి. ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది.


☀ ఇవి నమలడం వల తాజా శ్వాస అందిస్తుంది. నోటి దుర్వాసన పోగొడుతుంది.


☀ ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్, ఆస్తమా వంటి పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


☀ మెరుగైన రక్తప్రసరణకి దోహదపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


☀ శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తాయి.


☀ ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని పెంచుతాయి. ఆందోళనని తగ్గిస్తాయి.


☀ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఇతరులతో ఎలా మెలగాలో మీ పిల్లలకి ఇలా నేర్పించండి