మైదాతో చేసే వైట్ బ్రెడ్ కంటే తృణధాన్యాలతో చేసే హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. టోస్ట్ జామ్ నుంచి చికెన్ శాండ్ విచ్ వరకు దీన్ని ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది. సాధారణంగా గోధుమ, బార్లీ, బ్రౌన్, వైట్ బ్రెడ్, వోట్ బ్రెడ్ ఉన్నాయి. బ్రాండ్, రెసిపీని బట్టి అందులోని పోషకాల కంటెంట్ మారిపోతుంది.
ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి మంచి మూల హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్. తృణధాన్యాలతో చేసే ఈ ఆరోగ్యకరమైన బ్రెడ్ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. పోషకాలు అధికంగా ఉంటాయి. రక్తపోటుని తగ్గిస్తుంది. చిగుళ్ళ వ్యాధిని నివారిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ఈ హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉత్తమ ఎంపిక. దీన్ని మీ డైట్లో చేర్చుకోవడం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
బరువు తగ్గుతారు: బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు సాధారణంగా బ్రెడ్ ని దూరం పెట్టేస్తారు. వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల అధిక కేలరీలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుంది. అదీ కాకుండా వైట్ బ్రెడ్ శుద్ది చేసిన మైదా పిండితో చేస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరపోగా నష్టాలు ఎక్కువ. అటువంటి వారికి ఈ హోల్ గ్రెయిన్ ఫూ చక్కగా సరిపోతుంది. తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ తింటే ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా నివారిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ఇతర అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.
గుండె ఆరోగ్యానికి మేలు: ప్రాసెస్ చేసిన ధాన్యాలకు భిన్నంగా తృణధాన్యాలు గుండె ఆరోగ్యానికి సహాయపడే విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలని అందిస్తాయి. ఈ బ్రెడ్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ కె అన్నీ లభిస్తాయి. స్ట్రోక్ సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పొట్ట ఆరోగ్యం: నీటిలో కరగని ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ కరగని ఫైబర్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ లో పుష్కలంగా లభిస్తుంది. పేగు కదలికలని ప్రోత్సహిస్తుంది. పొట్ట ఆరోగ్యానికి అవసరమైన అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది.
దీర్ఘకాలిక రోగాలు నయం: నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అధ్యయనం ప్రకారం హోల్ గ్రెయిన్ బ్రెడ్ లో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆస్తమా, గుండె జబ్బులతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్: మధుమేహులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే మైదా చేసిన వైట్ బ్రెడ్ అసలు తినరు. కానీ వారికి అద్భుతమైన పోషకాలను ఇచ్చి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచే బ్రెడ్ హోల్ గ్రెయిన్ బ్రెడ్. న్యూట్రీయంట్స్ జర్నల్ లో ప్రచురించబడిన 2018 సమీక్ష ప్రకారం తృణధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి. బీఏంఐ, ధూమపానం, మద్యపానం, ఆహారపు అలవాట్లు, శరీరాక శ్రమ, జీవనశైలికి అణుగుణంగా దీన్ని డైట్ల్లో చేర్చుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నయా ట్రెండ్ - 'డిజిటల్ డిటాక్స్'తో ఆరోగ్యం, ఆనందం - ఇంతకీ దీన్ని ఎలా పాటించాలి?
Join Us on Telegram:https://t.me/abpdesamofficial