ఈ మధ్య స్నాక్స్‌కు ప్రత్యామ్నాయంగా డ్రైయిడ్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ప్రాచూర్యంలోకి వచ్చాయి. అయినప్పటికీ వాటిలో ఉండే చక్కెర కంటెంట్ గురించి అనుమానాలు ఉన్నాయి. టైప్2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో నాడులు దెబ్బతినడం, హృదయ సంబంధ వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే వీరి ఆహార నియమాల విషయంలో తప్పనిసరిగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి.


డ్రైఫ్రూట్స్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. వీటి నుంచి చక్కెరలు నేరుగా రక్తంలోకి విడుదల అవుతాయి. పోస్ట్ ప్రాండియల్ గ్లైసేమియాలో సమస్యలు తలెత్తవచ్చు. ఇది గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచుకోవాల్సిన వారికి ఇబ్బందికరం కావచ్చు. డ్రై ప్రూట్స్‌లో కొవ్వులు, చక్కెరలు ఉండడం వల్ల వీటిని తీసుకోవడం ఇబ్బందే.


అయితే ఇప్పుడు డ్రై ప్రూట్స్ విషయంలో నిపుణుల దృష్టి కోణం మారింది. డ్రైఫ్రూట్స్ లోని ఫైబర్ స్థాయిలు, వాటిలోని ఇతర సూక్ష్మ పోషకాలతో పాటు తక్కువ కొవ్వు ఉండటం  వల్ల ఇప్పుడు అభిప్రాయాలు మారుతున్నాయి. తాజాగా జరిపిన పరిశోధనలు, అధ్యయనాలు డ్రైఫ్రూట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు లక్ష్యంగా సాగుతున్నాయి.


అధ్యయనం గురించి ..


ప్రస్తుతం సాగుతున్న అధ్యయనంలో డ్రై ప్రూట్స్ తీసుకోవడానికి డయాబెటిక్స్‌లో షుగర్ లెవెల్స్ పెరగడానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి పరిశోధిస్తున్నారు. ఈ అధ్యయనం కోసం మెండెలిన్ రాండమైజేషన్, జీనోమ్ వైడ్ అసోసియేషన్ స్టడి వంటి పద్ధతులను వినియోగించారు. ఈ మేరకు యూకే బయో బ్యాంక్ నుంచి 5,00,000 మందిని ఎంపిక చేసి, వారి నుంచి డేటా సేకరించారు. క్వొశ్చనీర్ లేదా ఆంత్రోపోమెట్రీ ద్వారా డేటా సేకరించారు. ఇన్వెన్స్ వేరియన్స్ వెయిటెడ్ మెథడ్ ద్వారా డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కలిగి ప్రభావాలను పరిశీలించారు. వెయిటెడ్ మీడియన్ పద్ధతుల్లో వేరియబుల్స్ చాలా స్థిరంగా ఉన్నాయట. హారిజాంటల్ ప్లియోట్రోపికి ఎటువంటి ఆధారాలు కనిపించలేదట. లీవ్ వన్ అవుట్ ఎనాల్సిస్ సూచనలు బలంగా ఉన్నట్టు తెలిపారు.


అధ్యయన ముగింపు రిపోర్ట్


డ్రైయిడ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ మరింత ఎక్కువ అవుతుందా అనే విషయాన్ని ఈ అధ్యయనం పరిశీలించింది. డ్రైయిడ్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ లక్షణాలు తగ్గినట్టు గమనించారట. వీటిలో ఉండే కెరోటినాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ వల్ల శరీరంలోని వివిధ భాగాల మీద డయాబెటిస్ ప్రభావం సన్నగిల్లినట్టు గమనించారట.


ఎండిన ఫలాలలో చాలా పెద్ద మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది డయాబెటీస్ మరింత ముదిరిపోకుండా రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు ఎండు ఫలాలలో ఇన్సులిన్ సెన్సిటివిటికి సంబంధించిన చాలా రకాల ఫ్లెవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి డయాబెటిస్ సమస్య తీవ్రం కాకుండా దుష్ప్రభావాలు త్వరగా ప్రభావితం చెయ్యకుండా రక్షిస్తాయి. అయితే ఈ అధ్యయనం జరిగింది యూరోపియన్ల మీద గనుక ఇది ప్రపంచంలోని మిగతా భాగాల్లోని జనాభాకు కూడా ఆపాదించేందుకు ప్రస్తుతానికి వీలు లేదని కూడా ఈ అధ్యయనకారులు అంటున్నారు. ఈ విషయంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా వివిధ అధ్యయనాలు జరగాల్సి ఉంది.


Also Read : Lung Cancer: స్మోకింగ్ వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుందా? వేరే కారణాలూ ఉన్నాయంటోన్న పరిశోధకులు, అవి ఇవే!