Bhajan Clubbing Trend in India : భారతదేశంలో సంస్కృతి వేగంగా మారుతుంది. ఇప్పుడు ఒక కొత్త రకమైన నైట్‌లైఫ్ ట్రెండ్ (Nightlife Trend) అవుతుంది. అయితే Gen Z ట్రెండ్ అంటే నైట్ పార్టీలు, మద్యం అనుకునేరు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునే ట్రెండ్ వాటికి సంబంధం లేనిది. ఎందుకంటే ఇది పూర్తిగా భక్తి, సంగీతం(Bhakthi Meets Beats), ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంటుంది. ఆ ట్రెండే 'భజన క్లబ్బింగ్(Bhajan Clubbing)'. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ జెన్ Zని బాగా ఆకర్షిస్తుంది. ఇది సంస్కృతి, విశ్వాసం, సమాజంలో నెమ్మదిగా మార్పులు తీసుకువచ్చేలా ఉందంటున్నారు నెటిజన్లు.
ఇండియాలో కొత్త రకం నైట్ లైఫ్
భజన క్లబ్బింగ్‌లో భాగంగా సాంప్రదాయ భక్తి గీతాలను ఎక్కువ సౌండ్‌స్కేప్‌లతో మిళితం చేస్తారు. ఇది పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ తరహా మీటింగ్‌లు క్లబ్ వాతావరణాన్ని పోలి ఉంటాయి. మసకబారిన లైట్లు పెట్టి.. లీనమయ్యే సంగీతంతో.. సామూహిక నృత్యాలు చేస్తూ.. మంత్రాలు, భజనలతో ఈ నైట్ లైఫ్ నిండి ఉంటుంది. ప్రస్తుతం యువత ఫాలో అవుతున్న ఈ ట్రెండ్.. పార్టీలకు ఆల్టర్నేటివ్గా మారుతున్నాయి. డివోషనల్ మూఢ్లో భాగంగా.. మత్తుకు బదులుగా భావోద్వేగాల్లో తేలుతూ ఉంటారు. ఈ ట్రెండ్ యువతను తమ మూలలకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
జెన్ Z ఎందుకు ఫాలో అవుతుందంటే
జెన్ Z పట్టణ నైట్‌లైఫ్‌ను చాలాకాలంగా ఫాలో అవుతుంది. అయితే పాశ్చాత్య క్లబ్ కల్చర్ సంస్కృతికి వారిని దూరంగా వెళుతోంది. కానీ దానికి బదులుగా ఆత్మపూర్వకంగా, వ్యక్తిగతంగా అనిపించే ఈ వేడుకను ఎంచుకుంటుంది. ఇది వారిని సంస్కృతికి దగ్గర చేస్తుంది. అంతేకాకుండా భజన క్లబ్బింగ్ సాంప్రదాయ సంగీతానికి కొత్త గుర్తింపునిస్తుంది. భక్తి గీతాలను ఆధునిక బీట్‌లతో మిళితం చేసి.. ఆచారాలకు వారిని మళ్లీ కనెక్ట్ చేస్తుంది. మద్యం, మాదక ద్రవ్యాలు లేని ఈ ట్రెండ్ కూడా మానసిక ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ ట్రెండ్‌లో అందరూ కలిసి పాడుకుంటూ.. చెప్పులు లేకుండా నృత్యాలు చేస్తూ హై పొందుతారు.
వైరల్ స్పార్క్
ఈ ధోరణి ఇంతకు ముందు చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండేది. కంటెంట్ క్రియేటర్ల పుణ్యమా అని ఆ ట్రెండ్ ఇప్పుడు ఎక్కువమందికి రీచ్ అయింది. వందలాది మంది ఈ ట్రెండ్స్‌లో పాల్గొంటున్నారు. కొందరు వీటిని 'ఆధ్యాత్మిక రేవ్స్(Spiritual Rave)' అని.. మరికొందరు 'ఆత్మ వలయాలు' అని పిలుస్తున్నారు. కానీ పేరుతో సంబంధం లేకుండా భక్తి, సంగీతం, భాగస్వామ్య శక్తి అనే అంశంతోనే ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారు.
సాంస్కృతిక మార్పు
ప్రయోగాత్మక ఫార్మాట్‌గా ప్రారంభమైన ఈ ట్రెండ్.. లైఫ్‌లో బ్యాలెన్స్ కోసం వెతుకుతున్న వారికి ఓ వరంగా మారింది. వీనూత్న మార్పులతో ముందుకు వెళ్లిపోతున్న వారిలో సాంస్కృతిక మార్పు తీసుకువస్తుంది.