కారం తినేవారు ఎక్కువ మంది పేదలే. ధనవంతులంతా కారం తక్కువ తింటారని చెప్పుకుంటారు. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు. ఎవరైతే స్వీట్స్ అధికంగా తింటారో వారి జీవితకాలం తగ్గిపోతుంది. ముఖ్యంగా గొడ్డుకారం తినేవారి జీవితకాలం పెరుగుతున్నట్టు అధ్యయనం చెబుతోంది. సాధారణ ఆహారం తినేవారితో పోలిస్తే స్పైసీ ఫుడ్స్ తినేవారు 14% అధికంగా జీవించే అవకాశం ఉందని చెబుతోంది ఈ అధ్యయనం. అలాగే వారికి క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయని కూడా చెబుతోంది అధ్యయనం.
ఈ అధ్యయనంలో భాగంగా నాలుగు లక్షల 90 వేల మందిపై పరిశోధన చేశారు. వారిలో 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ళ వయసు వరకు ఉన్నవారు పాల్గొన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో 20,000 మంది చనిపోయినట్లు తేలింది. వారిలో స్పైసీ ఫుడ్స్ తింటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. స్వీట్లు తింటున్న వారే అధికంగా మరణించినట్టు తెలిసింది. వారానికి రెండు రోజులపాటు స్పైసీ ఫుడ్స్ తింటే మరణ ప్రమాదం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది. దాదాపు ప్రతిరోజు కారం నిండిన ఆహారం తినేవారితో పోలిస్తే వారానికి ఒకసారి మాత్రమే కారం నిండిన ఆహారాలు తినేవారు 14% ఎక్కువ మరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని అధ్యయనం చెబుతోంది. అయితే ఈ అధ్యయనంలో పురుషులు, స్త్రీలు ఇద్దరూ పాల్గొన్నారు.
స్పైసీ ఫుడ్స్ లలో మిరపకాయలు, మసాలా దినుసులు ఇతర సుగంధ ద్రవ్యాలు వంటివి ఎక్కువగా కలుపుతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టే శరీరానికి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చి రోగాల బారిన పడకుండా అవి కాపాడుతున్నట్టు అధ్యయనం వివరిస్తోంది. అలా అని మరీ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినాల్సిన అవసరం లేదు. సాధారణ స్పైసీ ఫుడ్స్ ను రోజూ తింటే చాలు. పిల్లలకు మాత్రం స్పైసీ ఫుడ్స్ తినిపించడం మంచిది కాదు. పొట్టలో మంట, వికారం వంటివి మొదలయ్యే అవకాశం ఉంది. మీరు ఏ ఎంతవరకు కారాన్ని తట్టుకోగలరో, దానికి కొంచెం తక్కువగానే తినడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పంచదారతో నిండిన ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టండి. ఆరోగ్యం దానికదే బాగవుతుంది. మన శరీరంలో సగం అవయవాలు పంచదార వల్లే పాడయ్యే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి వచ్చిందంటే శరీరంలోని ప్రధాన అవయవాలన్నింటికీ ముప్పే. పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు కూడా త్వరగా పెరిగిపోతారు.
Also read: నీరు తక్కువగా తాగుతున్నారా? అయితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త
Also read: వయసుకు తగ్గట్టు నిద్రపోవాలి, మీ వయసుకు మీరు ఎంత నిద్రపోవాలో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.