Hotel-Style Idlis at Home : ఇడ్లీలు ఆరోగ్యానికి మంచిది. చాలామంది కూడా ఇష్టంగా తింటారు. అయితే వీటిని కొందరు బాగా చేస్తారు. మరికొందరికి సరిగ్గా రాదు. మరికొందరు హోటల్ స్టైల్ ఇడ్లీలను బాగా ఇష్టపడతారు. ఎందుకంటే అవి పొంగుతూ, తెల్లగా, స్పాంజీలాగా మెత్తగా ఉంటాయి. అయితే కొన్ని సింపుల్ టెక్నిక్స్ వాడితే మీరు కూడా ఇంట్లో హోటల్ స్టైల్ ఇడ్లీలు చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా చేయాలి? తయారు చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాలు చూసేద్దాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

  • మినపప్పు - 1 కప్పు
  • బియ్యం - 3 కప్పులు
  • ఉప్పు - రుచికి తగినంత
  • మెంతులు
  • అటుకులు

తయారీ విధానం

మినపప్పు తక్కువ అయితే ఇడ్లీలు గట్టిగా అవుతాయి. ఎక్కువైతే బాగా రాకపోవచ్చు కాబట్టి పర్​ఫెక్ట్ మెజర్స్ తీసుకోవడం మంచిది. బియ్యం తీసుకుంటే 3 : 1 నిష్పత్తిలో.. రవ్వ అయితే 2 : 1 నిష్పత్తిలో తీసుకోవచ్చు. నానబెట్టేప్పుడు చాలామంది వీటిని కలిపి నానబెడతారు. ఆ తప్పు అస్సలు చేయకండి. బియ్యం 5, 6 గంటలు నానబెట్టాలి. పప్పును - 3 నుంచి 4 గంటలు సరిపోతుంది. రెండూ చల్లని నీటితో నానబెట్టుకోవాలి. 

గ్రైండింగ్ సీక్రెట్

మినపప్పు తేలికగా నలుగుతుంది. బియ్యాన్ని కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తి పేస్ట్​గా ఉండకూడదు. మరీ రవ్వగా మారకూడదు. అయితే పిండిని గ్రైండ్ చేసేప్పుడు మిక్సీ కాకుండా గ్రైండర్ వాడితే మరీ మంచిది. అయితే పిండిని రుబ్బడం కంటే.. దానిని ఫెర్మెంట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇడ్లీలు క్రాక్స్ లేకుండా, స్పాంజీగా రావడంలో ఇదే హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇడ్లీపిండిని బియ్యం పిండిని కలిపి రాత్రంతా లేదా దాదాపు 8 గంటలు ఫెర్మెంట్ చేయాలి. 

Continues below advertisement

ఫెర్మెంట్ చేసేప్పుడు పిండిని ఫ్రిడ్జ్​లో పెట్టకూడదు. అప్పుడే ఇడ్లీలు స్పాంజీల్లా వస్తాయి. చిటికెడు మెంతులు కూడా కలిపితే బ్యాటర్ మరింత పొంగుతుంది. ఉప్పు ఉదయం ఇడ్లీలు వేసుకునే ముందు కలిపితే మంచిది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ రెడీ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్​పై కాస్త నూనె రాసి.. బ్యాటర్​ని ఇడ్లీలుగా వేసుకోవాలి. ఇలా ఇడ్లీలను 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి ఇడ్లీలు రెడీ. ఇడ్లీలు మరింత మెత్తగా రావాలనుకుంటే మీరు అటుకులు కూడా వేసుకోవచ్చు. మరికొందరు పెరుగు కూడా వేస్తుంటారు. షుగర్ కూడా ఇడ్లీలు మెత్తగా రావడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని కొబ్బరి పచ్చడి లేదా మీకు నచ్చిన చట్నీలు, సాంబార్​తో కలిపి లాగిస్తే సరి.