ఒకప్పుడు బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్ లు ఎక్కువగా ఉండేవి. అలాంటి ఆహారాలు స్వల్పకాలంలో పని చేసినప్పటికీ దీర్ఘకాలంలో అవి ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తాయి. నిర్ధిష్ట ఆహారాలు తినడం లేదా పరిమిత కేలరీలు తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలకి దారి తీయడమే కాకుండా శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. అందుకే బరువు తగ్గించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది అల్పాహారం. పోషకాహార నిపుణులు ప్రకారం ఆరోగ్యకరమైన అల్పాహారం బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహార్లు బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. ఈ చిట్కాలు పాటించారంటే బరువు తగ్గడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి.


సరైన అల్పాహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే స్నాక్స్ తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలని స్థిరీకరించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారు.


ప్రోటీన్, ఫైబర్


పొట్ట నిండుగా సంతృప్తిగా అనిపించేందుకు ప్రోటీన్, ఫైబర్ మిళితం చేసే స్నాక్స్ ఎంచుకోవాలి. ఇవి బరువు తగ్గించడానికి మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతాయి. బెర్రీలు, కాల్చిన చిక్ పీస్( శనగలు) తో కలిపి పెరుగు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యకరం.


మైండ్ ఫుల్ గా తినాలి


అదనపు కేలరీలు తీసుకోవడాన్ని నివారించడానికి అల్పాహారం తీసుకునేటప్పుడు ఎంత తింటున్నామనే అవగాహన తప్పని సరి. అది బ్రేక్ ఫాస్ట్ విషయంలో మాత్రమే కాదు భోజనానికి వర్తిస్తుంది. అతిగా తినడం, బయట చిరుతిండిని నివారించడానికి ఇంట్లో లభించే స్నాక్స్ చిన్న కంటైనర్ లో లేదా బ్యాగీలలో ముందే ఉంచుకోవాలి. ఆకలి అనిపించినప్పుడు తింటే సరిపోతుంది.


చక్కెరలు నివారించాలి


అదనపు చక్కెరలు, స్వీటేనర్లు తక్కువగా ఉండే స్నాక్స్ ఎంచుకోవాలి. కొనుగోలు చేసే ప్యాక్స్ మీద చక్కెర ఎంత మోతాదులో ఉందో చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఎంపికలకు దూరంగా ఉండాలి.


స్నాక్స్ ముందే సిద్ధం చేసుకోవాలి


ఆకలి ఏదైనా తినేలా ప్రేరేపిస్తుంది. అటువంటి టైమ్ అనారోగ్యకరమైన ఎంపికలు చేసుకుంటారు. అలా జరగకూడదు అంటే ముందుగానే స్నాక్స్ సిద్ధం చేసుకోవాలి. పోషకమైన అల్పాహారం కోసం ముందుగానే కూరగాయల ముక్కలు కట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఉడికించిన గుడ్లు బాక్స్ లో అందుబాటులో ఉండేలా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినేందుకు ఇవి రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాయి


ఆకలి తెలుసుకోవాలి


ఆకలి, పొట్ట నిండిన భావన రెండింటికీ వచ్చే సంకేతాలు గ్రహించుకోవాలి. ఒక్కోసారి దాహంగా అనిపించినా అది ఆకలి అనే సంకేతాన్ని గుర్తించాలి. నిజంగా ఆకలిగా అనిపించినప్పుడు అల్పాహారం తీసుకుని పొట్ట నిండుగా అనిపించినప్పుడు తినడం ఆపేయాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: బార్లీ గడ్డి పొడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు