Six Rules for Saving Money : డబ్బులు ఎవరికీ ఊరికే రావు. అందుకే కష్టపడాలి. అలాగే డబ్బులు సేవింగ్ చేయాలన్నా కూడా ఇదే ఫాలో అవ్వాలి. మనీ సంపాదించాలన్నా.. మనీని సేవ్ చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. మీకు వచ్చే ఆదాయాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఎలా ఖర్చుపెట్టాలో తెలిస్తే డబ్బులు సేవ్ చేయడం ఈజీ అవుతుంది. మీకు డబ్బులు ఎలా ఆదా చేయాలో తెలియకపోతే ఈ 6 టిప్స్ కచ్చితంగా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 

Continues below advertisement


50/30/20 బడ్జెట్ రూల్


మీకు వచ్చే ఆదాయాన్ని 50/30/20 ఇలా డివైడ్ చేయాలి. 50 శాతం డబ్బును ఫుడ్, ఇంటి రెంట్, ఇన్సురెన్స్, ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు, రోజూ ఆఫీస్​కి లేదా బయటకి వెళ్లేందుకు అవసరమయ్యే జర్నీ ఖర్చులు ఉండాలి. మిగిలిన 30 శాతంలో ట్రిప్​కి వెళ్లేందుకు, షాపింగ్ (డ్రెస్​లు, గాడ్జెట్స్), ఎంటర్​టైన్​మెంట్ కోసం వాడుకోవాలి. దీనిని బేసిక్స్​లో కూడా కలుపుకోవచ్చు. మిగిలిన 20 శాతం సేవింగ్స్​కి పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్, ఇన్వెస్ట్​మెంట్స్, రిటైర్​మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. 


కాస్ట్లీ ఐటమ్ కొనాలంటే.. 


మీరు ఏ వస్తువువైన కొనాలని ఇష్టపడడంలో తప్పులేదు. అయితే దాని ధర ఎక్కువగా ఉంటే.. మీరు వస్తువు కొనడానికి మూడు రోజులు టైమ్ తీసుకోండి. ఇది మీకు నిజంగా అవసరమా? లేక మీకు తీసుకోవాలనే గట్ ఫీలింగ్ లేదా అది మీకు సంతోషాన్ని ఇస్తుందనిపిస్తే.. మూడు రోజుల తర్వాత దానిని కొనండి. ఈ మూడు రోజుల్లో వద్దులే అనిపిస్తే కొనకుండా మనీ వేస్ట్ చేయకుండా ఉండగలుగుతారు. కేవలం కాస్ట్ ఎక్కువగా ఉండే వస్తువులే కాదు.. అవసరంలేని వస్తువులు కొనే ముందు కూడా మూడు రోజుల టైమ్ తీసుకోండి. అప్పటికీ మీకు అవసరమనిపిస్తే కొనుక్కోవచ్చు. 


ఎమర్జెన్సీ ఫండ్ రూల్


మీరు సంపాదించే డబ్బులో ప్రతి నెల కాస్త డబ్బును ఎమర్జెన్సీ ఫండ్​లో జమ చేయాలి. అవసరాల కోసం అప్పుడప్పుడూ వాడుకున్నా.. మీ దగ్గర కనీసం 3 నుంచి 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలి. అంటే మీకు ప్రతి నెల 50వేలు ఆదాయం వస్తుంది అనుకుంటే.. మీ ఎమర్జెన్సీ ఫండ్​లో 1,50,000 ఉండాలనమాట. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇవి ఉపయోగపడతాయి. 


మినిమలిజం.. 


మినిమలిజం అనేది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన మరో రూల్. ఓ వస్తువును కొంటే.. మీ దగ్గరున్న అవసరం లేని మరోవస్తువును దానం చేయడమో.. అమ్మడమో చేయాలి. ఈ మినిమలిజం మీకు లైఫ్​ని బ్యాలెన్స్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. 


ఆటోమేటిక్​గా..


సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు మీరు దానిని ఈఎంఐ ఆప్షన్​లాగా లేదా ఆటోమెటిక్​గా డెబిట్​ అయ్యేలాగో ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు దాయాలనుకుంటే ఇతర కారణాలతో ఆగిపోవచ్చు కానీ ఇలా ఆటోమెటిక్​గా పెట్టడంవల్ల ముందే సేవింగ్స్​లోకి డబ్బులు వెళ్లిపోతాయి. 


క్రెడిట్ కార్డ్ వినియోగం


తప్పుదు అనుకున్నప్పుడు.. మళ్లీ వెంటనే గడువు తేదీలోపు కట్టేయగలను అనుకున్నప్పుడే క్రెడిట్ కార్డ్ వాడాలి. లేదంటే ఎక్కువ వడ్డీతో డబ్బులు కట్టాల్సి వస్తుంది. దీనివల్ల మీరు సేవింగ్స్ చేయడం కష్టమవుతుంది. కానీ కరెక్ట్​గా ప్లాన్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్​ వినియోగం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. షాపింగ్స్ చేసేప్పుడు క్యాష్ బ్యాక్స్ వంటివి కూడా పొందవచ్చు. 



ఇదీ చదవండి : శాలరీని 50-30-20 రూల్​తో ఎలా బ్రేక్ చేయాలి.. సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి