5 Interesting Facts About Sine Shetty: మూడు దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 18న ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముగియనున్నాయి. ఈ పోటీల్లో 130కి పైగా దేశాల అందాల భామలు పోటీ పడ్డారు. భారత్‌ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి ఫైనల్‌ రౌండ్‌కు చేరుకున్నది. టాప్ 20లో నిలిచింది.


జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్


ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 71వ మిస్ వరల్డ్ ఫైనల్స్ జరగనున్నాయి. మార్చి 9న సాయంత్రం ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభం కానుంది. ప్రస్తుత టైటిల్ హోల్డర్, పోలాండ్‌కు చెందిన కరోలినా, తన కిరీటాన్ని ఈ పోటీలో గెలిచే ముద్దుగుమ్మకు అందజేయనుంది. సినీ శెట్టి సొంత గడ్డపై విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ ఏడాది భారత్ తరఫున మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్న సినీ శెట్టి గురించి 5 ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..      


1. ముంబైలో పుట్టి పెరిగిన కర్నాటక వాసి


సినీ శెట్టి పూర్వీకులది కర్నాటక. కానీ, ఆమె ముంబైలోనే పుట్టి పెరిగింది. ఇప్పటికీ ఆమె బంధువులు, మిత్రులు కర్నాటకలో ఉన్నారు. తరచుగా అక్కడికి వెళ్లి వస్తుంది. చిన్నప్పటి నుంచి సినీ శెట్టికి సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టం. వీటిని నేర్చుకునేందుకు ఆమె కుటుంబ చాలా సపోర్టు చేసింది.


2. ప్రొఫెషనల్ డ్యాన్సర్


సినీ శెట్టి మంచి డ్యాన్సర్. 14 ఏండ్ల వయసులోనే భరత నాట్యం నేర్చుకుంది. ఆమె ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు రాధాకృష్ణన్ పద్మిని దగ్గర భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పదుల సంఖ్యలో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. 


3. ఎడ్యుకేషన్


సిని శెట్టి విద్యాభ్యాసం పూర్తిగా ముంబైలోనే కొనసాగింది. సెయింట్ డొమినిక్ సావియో యూనివర్సిటీ నుంచి    అకౌంటింగ్, ఫైనాన్స్‌ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది. ప్రస్తుతం, ఆమె చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్(CFA) కోర్సు చదువుతోంది. 


4. స్ఫూర్తి ఎవరంటే?


సినీ శెట్టి నటి ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. ఆమె నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందినట్లు వెల్లడించింది. ఆమె ఎదిగిన విధానం, సక్సెస్ సాధించిన తీరు, ఆమె మాటలు తనకు ఎంతో నచ్చుతాయి అంటుంది.  


5. అందాల పోటీల ప్రయాణం


సినీ వెట్టి 2022లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నది. కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహించి మిస్ ఇండియా కర్ణాటక టైటిల్‌ ను గెలుచుకుంది. అదే జోష్ లో ఇప్పుడు మిస్ వరల్డ్ 2023 పోటీల్లో పాల్గొంటుంది.   


ఇక మిస్ వరల్డ్ 2023 ఫైనల్ పోటీలను మార్చి 9 రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు జరగనున్నాయి. పలు చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాయి. భారత్ నుంచి చివరి సారిగా 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. 2024లో సినీ శెట్టి ఆ కిరీటాన్ని దక్కించుకోవాలని భారతీయులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 






Read Also: శివశక్తిగా తమన్నా- ‘ఓదెల 2’ నుంచి స్టన్నింగ్ పోస్టర్‌ రిలీజ్!