Manage Hypertension Tips : బీపీతో ఇబ్బంది పడేవారు తమ లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేయడం వల్ల దానిని కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. అలాగే దానిని దూరం చేసుకోవాలన్నా కూడా కొన్ని రెగ్యులర్​గా ఫాలో అవ్వాలి అంటున్నారు. అవేంటో.. జీవనశైలిలో చేసే ఈ మార్పులతో బీపీ ఎలా కంట్రోల్ అవుతుందో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బరువు

అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. బెల్లీని తగ్గించుకోవడం వల్ల రక్తపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. 

వ్యాయామం

రక్తపోటును తగ్గించుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల యాక్టివ్​గా ఉంటారు. రోజూ జిమ్ లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. మీరు వర్క్​అవుట్స్ చేయకుంటే 30 నుంచి 45 నిమిషాలు నడవండి. నడక కూడా బీపీని కంట్రోల్ చేయడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. 

డైట్ 

హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఫ్యాట్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వీటిని రోజూ తినడంతో పాటు డీప్ ఫ్రై చేసిన, కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. 

ఉప్పు

తీసుకునే ఆహారంలో ఉప్పుని పరిమితం చేయాలి. సోడియం తీసుకోకపోవడం తగ్గించకుంటే బీపీ ఎక్కువ అవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని తగ్గించుకోవాలని అంటున్నారు. 

స్మోకింగ్ 

ధూమపానం చేయడం వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదం బాగా పెరుగుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. కాబట్టి స్మోకింగ్ మానేస్తే మంచిది. 

నిద్ర 

సరైన నిద్ర లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దానిలో బీపీ కూడా ఒకటి. కాబట్టి నిద్ర నాణ్యతను పెంచుకోండి. రాత్రి నిద్ర కనీసం 7 నుంచి 9 గంటలు ఉండేలా చూసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచిది. 

ఒత్తిడి

ఒత్తిడి కూడా రక్తపోటును అధికం చేస్తుంది. కాబట్టి దానిని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం, మెడిటేషన్ వంటివి చేయొచ్చు. ఇది మానసికంగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. 

ఈ రొటీన్​ని ఫాలో అవ్వడంతో పాటు రెగ్యులర్​గా చెకప్స్ చేయించుకోవాలి. బీపీ ఎంత ఉంది.. ఎలాంటి సమయాల్లో ట్రిగర్ అవుతుందనే అంశాలు గుర్తిస్తే దానిని అదుపులోకి తీసుకురావడం సులభం అవుతుంది. అంతేకాకుండా మధుమేహం కూడా బీపీని పెంచుతుంది. కాబట్టి మీకు మధుమేహం కూడా ఉంటే దానిని కూడా అదుపులోకి తెచ్చుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోవాలి. వైద్యులు సూచించే మందులను రెగ్యులర్​గా వేసుకుంటూ వీటిని ఫాలో అయితే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.