రోజుల్లో ఎక్కువ కాలం జీవించడం అనేది కలే. చిన్న వయస్సులోనే చాలామంది వివిధ అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. ఇందుకు మన ఆహారపు అలవాట్లు కారణమైతే.. జీవనశైలి అలవాట్లు కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో మనం ఆరోగ్యం, నిత్య యవ్వనంగా ఎక్కువ కాలం జీవించడంపై ఫోకస్ పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టండి. 


ఆకు కూరలను తినండి


మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలను క్రమం తప్పకుండా తింటూనే ఉండాలి. ఆకు కూరలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మీరు సిటీలో నివసిస్తున్నట్లయితే ఆకు కూరలు తప్పకుండా తాగాలి. ఎందుకంటే అవి మిమ్మల్ని వివిధ కాలుష్యాల నుంచి పోరాడుతాయి. వయస్సు పెరిగాక వచ్చే వినికిడి లోపం నుంచి కూడా రక్షిస్తాయి. పశు మాంసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దానివల్ల కొవ్వు పెరిగి గుండె, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  


బలవంతంగా మల విసర్జన వద్దు


కొందరు చాలా బలవంతంగా మల విసర్జన చేస్తుంటారు. అయితే, అది దీర్ఘకాలిక సమస్యలకు కారణం వచ్చు. అది క్రమేనా హయటల్ హెర్రియాకు దారి తీయొచ్చు. ఇది గుండె, మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. ఇది మరణానికి కూడా దారితీయొచ్చు. దీన్నే బెడ్‌పాన్ డెత్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. వయస్సుతోపాటే మలబద్ధకం కూడా పెరుగుతుంది. భబిష్యత్తులో మీకు ఈ సమస్య రాకూడదంటే నిత్యం నీళ్లు తాగుతూ ఉండండి. ఫైబర్ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. నిత్యం వ్యాయామం కూడా చేస్తుండండి.


పేగుల ఆరోగ్యం ముఖ్యం


పేగుల్లో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలో మంచివి ఉంటాయి. చెడు చేసేవీ ఉంటాయి. అయితే, మంచి బ్యాక్టీరియా ఎప్పుడూ మనలో రోగనిరోధశక్తికి సహకరిస్తాయి. అందుకే, వాటిని కాపాడుకొనే బాధ్యత మనదే. కాబట్టి ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కడుపులోని మలినాలు, విషతుల్యాలను శుభ్రం చేయొచ్చు. గట్ మైక్రోబయోమ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యానికి సహకరిస్తుంది. సోయా పాలు, గోధుమలు, ఓట్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలను తీసుకోవడం మంచిది. అంతేకాదు.. శరీరానికి తగిన వ్యాయామం కూడా అవసరమే. డైలీ కనీసం 20 నిమిషాలైన వ్యాయామం చెయ్యాలి. సమయానికి నిద్రపోవాలి.


నట్స్, ఫ్రూట్స్ బాగా తినండి


నట్స్ తినడం వల్ల హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిస్, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులతో చనిపోయే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. తీపి, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు బదులుగా.. డ్రై ఫ్రూట్స్, పండ్లను స్నాక్స్‌గా తీసుకోండి. ముఖ్యంగా బెర్రీలు తీసుకున్నట్లయితే.. అవి మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి, మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. 


మెదడు చురుగ్గా ఉండాలంటే..


వయస్సుతోపాటు మెదడు కూడా మొద్దుబారిపోతుంది. చిత్త వైకల్యం (dementia) ఏర్పడవచ్చు. అది చురుగ్గా ఉండాలంటే కేవలం ఆహారం తీసుకుంటే సరిపోదు. బ్రెయిన్ గేమ్స్ ఆడుతుండాలి. అంటే పజిల్స్ లాంటివి ఆడుతుంటే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు మీరు మీ కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. మెదడుకు ఏవైతో మేలు చేస్తాయో అవే.. గుండెకు కూడా మంచివి. మద్యపానం, స్మోకింగ్‌కు దూరంగా ఉండండి. మంచి నిద్ర ఎప్పుడూ మెదడుకు మేలు చేస్తుంది. అయితే, మరీ ఎక్కువ గానీ.. తక్కువగానీ నిద్రపోవద్దు. చిన్న చిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్ వాడకుండా బుర్రకు పని చెప్పండి. ఓటీపీలను గుర్తుపెట్టుకుంటూ ఎంటర్ చెయ్యండి. ఇంట్లోని ముఖ్య వ్యక్తుల ఫోన్ నెంబర్లను గుర్తుపెట్టుకోవడం వంటివి చేస్తుండండి. అవి మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ పవర్ పెంచుతాయి. 


ఉపవాసం మంచిదే


వారంలో కనీసం ఒక రోజు ఉపవాసం ఉండటం మంచిదే. దాని వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుంది. ఎక్కువ కాలం జీవించేందుకు తోడ్పడుతుంది. అయితే, ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌ తినకుండా మధ్యాహ్నం భోజనం చేద్దాం లే అని చాలామంది అనుకుంటారు. కానీ, అది మంచి విషయం కాదు. వీలైతే రాత్రివేళలో ఆహారం తక్కువ తినడం లేదా ఉపవాసం చెయ్యడం మంచిది. రాత్రి వేళ అతిగా తినొద్దు. దానివల్ల మీ నిద్ర, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. 


మీ పార్టనర్‌తో కలయిక చాలా ముఖ్యం


చాలామంది కొంత వయస్సు వచ్చాక పడక గది సుఖానికి పూర్తిగా దూరమవుతారు, అయితే, వైద్య నిపుణులు అలా అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. భాగస్వామితో సుఖాన్ని పొందడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కలయిక సమయంలో ఎండార్పిన్‌లు విడుదల అవుతాయని, అవి మీ కణాల పనితీరును మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. పండ్లను అతిగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దానివల్ల మీ సుఖ జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. 


Also Read: శోభనం రాత్రి వీడియోను పోస్ట్ చేసిన కొత్త జంట - తల బాదుకుంటున్న నెటిజన్స్, ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?