Man Died In a Road Accident In Medchal IT Corridor: సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు. ఫోన్ మాట్లాడుతూ, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడపడం కానీ, రోడ్డు దాటడం కానీ చేయకూడదు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి. ఇవి కనీసం రహదారి నిబంధనలు. అయితే, కొందరు వీటిని పాటించకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు రూల్స్‌పై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.


గాల్లోకి ఎగిరిపడ్డాడు




ఐటీ కారిడార్ (IT Corridor) వద్ద గిరి అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మీటర్లు గాల్లోకి ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలైన బాధితున్ని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రోడ్డు దాటడం వంటివి చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు.


Also Read: Crime News: భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్ - 45 రోజుల తరువాత వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ