Brahmamudi Serial Today Episode: కేక్ కటింగ్ తర్వాత రూంలోకి వెళ్లిన అపర్ణ దగ్గరకు కావ్య వెళ్తుంది. మీరు ఇక మామయ్యను క్షమించరా అని అడుగుతుంది. అయితే తప్పు చేసిన ఆ వ్యక్తిని నువ్వు సమర్థిస్తున్నావా? అని అపర్ణ అడగడంతో లేదని చెప్తుంది కావ్య అయితే రాజ్ తప్పు చేస్తే కూడా నువ్వు ఇలాగే చేసేదానివి కాదా? రాజ్ తప్పు చేస్తే ఇంట్లోంచి వెళ్లిపోతానని చెప్పింది నువ్వే కదా అని అడుగుతుంది. దీంతో కావ్య అవునని చెప్పగానే ఇక వెళ్లు ఇక్కడి నుంచి అని చెప్తుంది. దీంతో కావ్య మా ఆయన కూడా బాధపడుతున్నారని చెప్తుంది. మరోవైపు కళ్యాణ్, అప్పుకు ఫోన్ చేస్తుంటే అప్పు లిఫ్ట్ చేయదు. ఇంతలో అక్కడికి స్వప్న రాగానే స్వప్నను పిలుస్తాడు.
కళ్యాణ్: ఒకసారి నీ ఫోన్ ఇస్తావా?
స్వప్న: నా మొగుడే నా ఫోన్ అడగాలంటే భయపడతాడు. అలాంటిది నువ్విలా అడిగేస్తున్నావేంటి?
కళ్యాణ్: అబ్బా అలా కాదు స్వప్న మీ చెల్లెలు అప్పు ఉంది కదా నేను ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
స్వప్న: లిఫ్ట్ చేయడం లేదంటే నీతో మాట్లాడాలని లేదనే కదా అర్థం. మళ్లీ వేరే నెంబర్ నుంచి చేస్తే ఎలా మాట్లాడుతుంది.
కళ్యాణ్: అది కాదు స్వప్న.. ఒకసారి నేను చెప్పేది
స్వప్న: కళ్యాణ్ ఎందుకు సమస్యను పెద్దది చేసుకోవాలని చూస్తున్నావు. నా మాట విను కొన్ని రోజులు మీరు మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది. కావాలంటే ఇవన్నీ మర్చిపోవడానికి కొన్ని రోజులు ఆఫీసుకు వెళ్లు. పనిలో పడితే అన్ని సెట్ అయిపోతాయి.
రాహుల్: ఏంటి స్వప్న అలా మాట్లాడతావు. పాపం మాట్లాడలేదని కళ్యాణ్ అలా ఫీలవుతుంటే నువ్వేంటి సపోర్ట్ చేయాల్సింది పోయి. మర్చిపో.. ఆఫీసుకుపో.. అంటూ ఇబ్బంది పెడుతున్నావేంటి? ఒకసారి అప్పుతో మాట్లాడిస్తే ఏమౌతుంది.
అని రాహుల్ చెప్పగానే రాహుల్‌ను స్వప్న తిడుతుంది. నీకు మీ అమ్మకు కాపురాలు కూల్చే ఆలోచనలే వస్తాయా అంటుంది. ఇంతలో రాహుల్‌కు రుద్రాణి ఎదురొస్తుంది. స్వప్న, రాహుల్‌కు ఆఫీసుకు వెళ్లు అని చెప్తుంది అనగానే రుద్రాణి కూడా రాహుల్‌ను తిడుతుంది. పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తావేంటి. ఆ కళ్యాణ్ గాడు అప్పుకు దగ్గరై పెళ్లి చేసుకుంటే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. అని చెప్తుంది. మరోవైపు రాజ్, కావ్య ఆలోచిస్తుంటారు.
రాజ్: మా అమ్మా నాన్న కలిసిపోయారనుకుంటే మళ్లీ మొదటికి వచ్చింది.
కావ్య: కలిసిపోయారనుకుని మనం భ్రమ పడ్డాం. కానీ వాళ్లిద్దరి మధ్య ఆ దూరం అలాగే ఉంది.
రాజ్: పాపం మా డాడీని చూస్తే బాధగా ఉంది.
కావ్య: అత్తయ్యగారు అంత మొండిగా ఉండటానికి కూడా కారణం ఉంది కదా?
రాజ్: అందుకే కదా ఎటూ మాట్లాడలేకపోతున్నాను.
కావ్య: అత్తయ్యగారి మనసుకు అయ్యే గాయం మానిపోయే వరకు మామయ్యగారు. ఓపికగా చూడ్డం తప్పా ఇంకొక దారి కనిపించడం లేదు.
రాజ్: నిజమే మనం చేయాల్సిన ప్రయత్నాలు చేశాం.
కావ్య: వాళ్ల మధ్యకు మనం వెలితే ఇంకాస్త దూరం పెంచిన వాళ్లమే అవుతాము
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ మన మధ్య కూడా దూరం లేదా అంటూ కావ్య అంటుంది. ఇంతలో రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే కావ్య నిద్ర వస్తుందని పడుకుంటుంది. తర్వాత రోడ్డు మీద వెళ్తున్న పోకిరీలు అప్పును టీజ్ చేస్తారు. వల్గర్‌గా మాట్లాడతారు. దీంతో అప్పు వాళ్లను కొడుతుంది. అందులో ఒకడు కిందపడి రక్తం మడుగులో పడిపోతాడు. పోలీసులు వచ్చి అందరినీ స్టేషన్‌కు తీసుకుపోతారు. తర్వాత బంటి కళ్యాణ్‌కు ఫోన్ చేసి అప్పును అరెస్ట్ చేశారని చెప్పడంతో కళ్యాణ్ స్టేసన్ కు వెళ్లబోతుంటే ధాన్యలక్ష్మీ వచ్చి అపుతుంది. ఆమెకు అబద్దం చెప్పి కళ్యాణ్ స్టేషన్‌కు వెళ్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.