Buddha’s Guide to Handling Criticism & Conflict : మాటలు మాట్లాడటం చాలా సులభం. కానీ కొన్ని క్షణాల్లో మౌనం ఉండడమే మంచిది. అదే జ్ఞానం, బలానికి మూలం. ఏ వ్యక్తి ఏ విషయంపై ఎంత స్పందించాలో, ఎంత స్పందించకూడదో తెలుసుకున్నప్పుడే జీవితంలోని చాలా సమస్యలను సమర్థవంతంగా జయించగలుగుతాడు. నిజానికి కొన్నిసార్లు మాటల కన్నా.. మౌనమే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా మనస్సు, మాటలను అదుపులో ఉంచుకునేవారికి ఒత్తిడి దరిదాపుల్లోకి కూడా రాదు. తన పని తాను చేసుకుంటూ.. బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇదే విషాన్ని బుద్ధుడు కూడా చాటి చెప్పాడు. 

Continues below advertisement

బుద్ధుని సందేశం

ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు.. మౌనంగా ఉండాలని బుద్ధుడు చెప్పాడు. విమర్శ అద్దం లాంటిది. మీరు కోపంతో స్పందిస్తే.. ఆ అద్దం పగిలిపోతుంది. కానీ శాంతంగా వినడం ద్వారా మీరు నిజాలు ఏంటో తెలుసుకోగలుగుతారు. మీరు ఏదైనా కామెంట్ విని రెస్పాండ్ అవుతున్నారో.. రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మీతో వాదించినప్పుడు.. మౌనమే మంచి సమాధానం. జస్ట్ విని ఊరుకోండి. ఎందుకంటే మీరు కూడా వాదన మొదలు పెడితే సమస్య పెద్దది అవుతుంది. పైగా పరిస్థితిని రెండువైపులా నుంచి అర్థం చేసుకోలేరు. దీనివల్ల ఇగో పెరుగుతుంది. మౌనం ఎదుటి వ్యక్తిని ఆలోచింపజేస్తుందని, సమస్య సులభంగా పరిష్కారమవుతుంది ఆయన అన్నారు.

ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు.. మౌనంగా ఉంటే కోపాన్ని తగ్గించుకోవడం తెలివైన పని. ఎందుకంటే కోపాన్ని మరింత పెంచుకోవడం వల్ల పరిస్థితి దిగజారుతుంది. బాగా ఎమోషనల్గా బాధలో ఉన్నప్పుడు కూడా సైలెంట్గా ఉండడమే మంచిదని బుద్ధుడు సలహా ఇచ్చాడు. మౌనంగా ఉన్నప్పుడు మనలో ఏమి జరుగుతుందో.. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో తెలియజేస్తుంది. ఇది మీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది.

Continues below advertisement

జ్ఞానంతో కూడిన వినయం   

బుద్ధుని ప్రకారం.. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినప్పుడు.. సహనం, సంయమనంతో ఉండాలి. మౌనం ప్రతికూలతను కరిగిస్తుంది. ఎదుటి వ్యక్తి కోపాన్ని తగ్గిస్తుంది. వారిలోని ఎమోషన్ పూర్తిగా బయటకి వచ్చినప్పుడు వాళ్లు కూడా సైలెంట్ అవుతారు. అలాగే కోపంలో ఎదుటి వ్యక్తి మన గురించి నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ సమయంలో మౌనంగా ఉంటే చాలు. ప్రతిచోటా మీ అభిప్రాయాన్ని చెప్పనవసరం లేదు.

మీ సలహా అడగనప్పుడు మౌనంగా ఉండటం నిజమైన తెలివి అని చెప్పారు. జ్ఞానమనేది వినయంతో ముడిపడి ఉన్నప్పుడే దాని విలువ పెరుగుతుందన్నారు. మీ జ్ఞానం గురించి మీరు గర్వపడితే.. అక్కడితో మీరు నేర్చుకోవడం ఆపేస్తారు. అప్పుడు మీకు గౌరవం లభించదు. అహంకారంలో చిక్కుకుని నిజాన్ని దూరం చేసుకోవద్దని సూచించారు.                

మౌనమే ఆత్మ భాష   

మీ హృదయం ప్రేమ, శాంతి, కృతజ్ఞతతో నిండినప్పుడు.. మాటల అవసరం తగ్గుతుంది. ఆ సమయంలో మౌనం అత్యంత అందమైన ఎమోషన్గా మారుతుంది. ఎందుకంటే అది మాట్లాడకుండానే ప్రతిదీ చెబుతుంది. మౌనం.. శాంతి, జ్ఞానం, సమతుల్యతకు చిహ్నమని బుద్ధుడు బోధించాడు. కాబట్టి ముందు విని, అర్థం చేసుకున్నప్పుడే విషయంపై మీకు అవగాహన పెరుగుతుంది. మనలో నిజమైన మార్పు వస్తుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారం ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇది చెప్పడమే ముఖ్యం కానీ ABP దేశం.. ఎలాంటి నమ్మకం, సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఫాలో అవ్వడానికి సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.