నిద్ర పోయే అందరూ తప్పకుండా కలలు కంటూనే ఉంటారు. కొన్ని కలలు మన భయాలకు సంకేతాలయితే కొన్ని మనలోని ఆలోచనలకు. వీటికి భిన్నంగా కొన్ని భవిష్యత్తుకు సూచికలు కావచ్చని స్వప్నశాస్త్రం చెబుతోంది. ఇవి నిద్రలో చూసే కలల గురించిన విషయాలను గురించి స్వప్నశాస్త్రం వివరిస్తుంది. మరి కొన్ని కలలుంటాయి. అవి మనం మెలకువగా ఉండే కనే కలలు, మన ఆశలకు ప్రతిరూపాలు. అవి నెరవేర్చుకోవడమే లక్ష్యంగా జీవితం నడుస్తుంది. అలాంటి కలల్లో ఒకటి జీవిత భాగస్వామిని గురించినవి. కోరుకున్న భాగస్వామి లేదా ఆశించిన లక్షణాలు కలిగిన వ్యక్తి వంటి ఏవేవో కొన్ని స్టాండర్డ్స్ కూడా ఉంటాయి.


అందరూ పెళ్లి చేసుకోవడం విషయంలో కొంత బిడియంతోనో సిగ్గుతోనో ఉంటూ ఉంటారు. కొందరు లోలోపలే ఆశలు పడుతుంటారు. ఇలాంటి కలలు మీ వివాహ సంకేతాలు కావచ్చు.



  • డాన్స్ చేస్తున్నట్టు మీకు కల వచ్చిందంటే మీకు త్వరలోనే వివాహం నిశ్చయం అవుతుందని అర్థం.

  • కలలో అందమైన పనితనం కలిగిన, ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు కనిపిస్తే మీకు అందమైన భాగస్వామి లభిస్తాడని అర్థం.

  • ఎవరైనా మీకు నగలు ఇచ్చినట్లు కల వస్తే ఆ నగలు ఇచ్చిన వ్యక్తికి త్వరలో ఒక సంపన్న కుటుంబంలో వివాహం అవుతుందని అర్థం.

  • మీ కలలో జాతర జరుగుతున్నట్టు లేదా మీరు జాతరలో తిరుగుతున్నట్టు కనిపిస్తే త్వరలో మీకు తగిన జీవిత భాగస్వామిని పొందబోతున్నారని సంకేతం.

  • కలలో మీరు గడ్డం పెంచుకుని కనిపిస్తే మీ ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి రాబోతోందని అర్థం.

  • కలలో వజ్రం లేదా వజ్రాలు పొదిగిన అభరణాన్ని ధరించడం చూస్తే అది మంచి సంకేతం కాదు. ఈ కల మీ ఆనందమయమైన వైవాహిక జీవితానికి దిష్టి ఉందని దాన్ని కాపాడుకోవాలని సూచించే కలగా స్వప్నశాస్త్రం చెబుతోంది.

  • కలలో ఉంగరం దరించడం లేదా ఉంగరం కనిపిస్తే త్వరలో చాలా ప్రేమించే భాగస్వామి మీకు లభిస్తారని అర్థం

  • కొత్త పాదరక్షలు కొంటున్నట్టు కల వస్తే త్వరలోనే మీరు కూడా జత కట్ట బోతున్నారని తెలిపే సంకేతం.

  • కలలో జుట్టు దువ్వుకుంటున్నట్టు కనిపిస్తే అది సాధారణమైన కల కాదు. మిమ్మల్ని కొత్త జీవితానికి సిద్ధం చేయడానికి సంకేతం.

  • అడవిలో నడుస్తున్నట్టు కల వస్తే త్వరలో మీరు కొత్తగా ప్రేమలో పడబోతున్నారనేందుకు సూచన.

  • కలలో తల్లిదండ్రులు కలిసి కనిపిస్తే త్వరలో మీకు ఘనంగా వివాహం జరుగుతుందని అర్థం.

  • రైలులో ప్రయాణం చేస్తున్నట్టు కల వస్తే అది మీకు కల్యాణ ఘడియలు మొదలయ్యాయని చెప్పేందుకు సంకేతంగా భావించాలి.


Also read : పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.