Tips to Choose Personal Health Insurance : మీ ఆఫీస్ మీకు హెల్త్ ఇన్సురెన్స్ ఇస్తుందా? అయితే అది మంచి విషయమే. అయితే ఇది ఎలాగో ఉందని మీరు పర్సనల్​గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మానేస్తున్నారా? అయితే జాగ్రత్త. మీరు తప్పులో కాలేస్తున్నట్లే అంటున్నారు నిపుణులు. ఆఫీస్​ హెల్త్ ఇన్సురెన్స్ మీకు ఉన్నా.. పర్సనల్​గా కూడా మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల లాభామా? నష్టమా? అసలు హెల్త్ ఇన్సురెన్స్​ని ఎలా ఎంచుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆఫీస్ హెల్త్ ఇన్సురెన్స్ ఉంటే.. 

మీ కంపెనీ మీకు హెల్త్ ఇన్సురెన్స్ ఎంత కవర్ అయ్యేలా ఇస్తుందో చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు మీ ఆఫీస్ మీకు 3 లక్షల కవరేజ్ ఇస్తుందనుకో.. ఆస్పత్రిలో మీ బిల్ 7 లక్షలైతే.. మీరు ఆస్పత్రిలో నాలుగు లక్షలు.. సేవింగ్స్ డబ్బులు కట్టాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో మీ పర్సనల్ ఇన్సురెన్స్ కూడా ఉంటే.. అది కూడా బిల్​లో క్లైమ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. 

అంతేకాకుండా మీరు ఆ కంపెనీలో చేసేవరకే మీకు ఆఫీస్ హెల్త్ ఇన్సురెన్స్ క్లైమ్ అవుతుంది. ఏ కారణాలతో అయినా జాబ్ మానేస్తే అది కవరేజ్ ఇవ్వదు. కాబట్టి పర్సనల్ హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటే మంచే జరుగుతుంది. అంతేకాకుండా మీ వయసు ఎంత తక్కువ ఉన్నప్పుడు దీనిని తీసుకుంటే అంత మంచి బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. వయసు పెరిగే కొద్ది వీటి ధరలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నిపుణులు ఆఫీస్ ఇన్సురెన్స్​తో పాటు సొంతంగా కూడా ఒకటి తీసుకుంటే మంచిదంటున్నారు. 

పర్సనల్ ఇన్సురెన్స్​ ఎలా ఎంచుకోవాలంటే.. 

హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటే మంచిదే తీసుకోవాలి. పర్సనల్ హెల్త్ ఇన్సురెన్స్ తీసుకునేప్పుడు కొన్ని విషయాలు పక్కా తెలుసుకోవాలి. మీ ఆరోగ్య అవసరాలకు తగ్గట్లుగా ఆ ప్లాన్ ఉందో లేదో తెలుసుకోవాలి. ఫ్యామిలీ కవరేజ్, ప్రెగ్నెన్సీ వంటి బెనిఫిట్స్ ఉన్నాయో లేదో.. ఎక్కువగా ఆస్పత్రికి వెళ్తే సెట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి. మీ ఎమర్జెన్సీ సమయంలో కవర్ చేసే ప్లాన్ ఎంచుకోవాలి. కవరేజ్ డిటైల్స్ పూర్తిగా తెలుసుకోవాలి. సెటిల్​మెంట్ రేషియో 90 శాతానికి పైగా ఉండేది తీసుకుంటే మంచిది. 

ప్రీమియం, బెనిఫిట్స్ కంపేర్ చేసుకోవాలి. చీప్​గా వచ్చేవి కాకుండా మీకు బెస్ట్​ ఫలితాలు ఇచ్చేవి ఎంచుకోవాలి. మీకు అనువైన ఆస్పత్రులు మీ ఇన్సురెన్స్ లిస్ట్​లో ఉన్నావో లేదో చెక్ చేసుకోవాలి. మీరు ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వెయిటింగ్ పీరియడ్ ఉండే పాలసీని ఎంచుకోవాలి. వయసు పెరిగే కొద్ది అవసరమైన కవరేజ్​లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రూమ్ అద్దె, సర్జరీ కాస్ట్ వంటివి కవర్​ అవుతున్నాయేమో తెలుసుకోండి. రివ్యూలు కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు మంచి హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడంలో హెల్ప్ అవుతాయి.