Saving Tips for Employees : శాలరీ పెరిగితే చాలు... ఇంకేమి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇకనుంచి సేవింగ్స్ చేసేస్తాను. ముందున్న శాలరీతో నా ఖర్చులు తీరిపోతాయి. కాబట్టి మిగిలిన డబ్బులు ఇన్వెస్ట్ చేయడం లేదా దాచుకోవడం స్టార్ట్ చేయాలి అని చెప్తారు. జాబ్ చేసే చాలామంది మైండ్​లో ఇదే ఉంటుంది. బయటకు చెప్పకున్నా.. జీతం పెరిగితే సేవింగ్స్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ రియాలటీలో అది పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే శాలరీ పెరిగితే సేవింగ్స్ చేయడం అటుంచి.. ఎక్కువ ఖర్చులు(Expenses Increase After Salary Hike) పెరుగుతాయి. దీనివెనుక కారణం ఏంటి? మనీ సేవింగ్స్ విషయంలో చేసే తప్పులు ఏంటో తెలుసుకుందాం. 

Continues below advertisement


డబ్బులు మిగలట్లేదా? అయితే కారణాలివే..


శాలరీ పెరిగినా డబ్బులు మిగలకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే జీతం పెరిగితే పర్సనల్​గా కొన్ని ఖర్చులు (Lifestyle inflation reasons) పెట్టుకోవాలనుకుంటారు. కాస్త లైఫ్​ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. ఆ సమయంలో ఫోన్ తీసుకోవడం, షాపింగ్ చేయడం, ట్రావెల్ చేయడం, కొత్త ఫుడ్స్ ట్రై చేయడం వంటివి చేస్తారు. అంటే ఈ నెల ఇలా ఖర్చు పెడదాం నెక్స్ట్ శాలరీ నుంచి సేవింగ్స్ చేద్దామనుకుంటారు. 


కొందరికి ఇంక్రిమెంట్ వస్తే ఫ్రెండ్స్, కజిన్స్ పార్టీ అడుగుతారు. ఆ సమయంలో మొహమాటం కోసమైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల సేవింగ్స్ డిలే అవుతాయి. అలాగే శాలరీ పెరిగిందనే ఉత్సాహాంలో చిన్న చిన్న ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే శాలరీ పెరిగింది కదా అని కొన్ని వస్తువులను EMI ఆప్షన్​లో తీసుకోవడం, క్రెడిట్ కార్డు వాడడం చేస్తారు. దీనివల్ల పొదుపు చేయడం కష్టమవుతుంది. 


సేవింగ్స్ చేసేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే..


ఎన్ని కారణాల వల్ల డబ్బు ఖర్చు చేస్తున్నామన్నది కాదు.. డబ్బుపై మీకు ఎంత కంట్రోల్​ ఉందో తెలుసుకోవాలి. సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన ఓ ప్రధాన అంశం. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ ఇతర కారణంతోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. మీ దగ్గర డబ్బు త్వరగా ఖర్చు అయిపోతుందనుకున్నప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే..


ఆటోమేట్ డెబిట్ (Automated Savings)


మీ సేవింగ్స్ కోసం శాలరీ వచ్చిన వెంటనే 20 నుంచి 30 శాతం డబ్బు ఆటోమేట్​గా కట్​ అయిపోయేలా సెట్ చేసుకోవాలి. RD లేదా FD, మ్యూచువల్ ఫండ్స్ SIP చేయడం, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ చేయడం వంటివి ఆటోమేటిక్​గా ట్రాన్స్​ఫర్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. శాలరీ ఎప్పుడు వస్తుందనే దానిపై అవగాహన ఉంటే.. శాలరీ క్రెడిట్ అయ్యే నెక్స్ట్​ డేని ఆటోమేట్ డెబిట్ కోసం పెట్టుకోవచ్చు. దీనివల్ల సేవింగ్స్ డిలే అవ్వవు. అలాగే టార్గెట్స్ పెట్టుకోవచ్చు. 6 నెలల్లో నేను ఇంత అమోంట్ సేవ్ చేస్తాను వంటివి పెట్టుకుంటే క్రమంగా సేవింగ్స్ చేయగలుగుతారు. 


సేవింగ్స్​ కోసం 50-30-20 రూల్ (50-30-20 rule for money management)..


డబ్బులు సేవ్ చేయాలనుకునేవారికి ఈ రూల్ చాలా అవసరం. ఎందుకంటే 50 శాతం అవసరమైన ఖర్చులకు, 30 శాతం విలాసాలకు, 20 సేవింగ్స్ అనే రూల్ పెట్టుకుంటే డబ్బులు ఆటోమేటిక్​గా సేవింగ్స్​కి వెళ్లిపోతాయి. సరైన బడ్జెట్ ప్లాన్ ఉంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. అలాగే నెల మొదట్లోనే ఏమేమి ఖర్చులు ఉన్నాయో తెలుసుకుంటే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండొచ్చు. 


క్రెడిట్ కార్డు వాడే అలవాటు ఉంటే దాని వినియోగం తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఇది సేవింగ్స్​పై కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఇన్​కమ్ పెరిగినప్పుడు సేవింగ్స్ రేట్ కూడా పెంచుకోవాలి. వీటన్నింటినీ ఫాలో అయితే మీరు కూడా కచ్చితంగా సేవింగ్స్ చేయగలుగుతారు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎంత త్వరగా సేవింగ్స్ మొదలైతే.. అంత త్వరగా మీ లైఫ్ రీసెట్ అవుతుంది.