గురుగ్రామ్‌కు చెందిన NGO ‘సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్’ భారతీయ పైలెట్ల మీద తాజాగా ఓ సర్వే నిర్వహించింది. సాధారణంగా విమాన ప్రయాణంలో పైలట్లు ఎలా ఉంటారనే అంశంపై సర్వే నిర్వహించి పలు గణాంకాలను సేకరించింది. వీటిలో పలు ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రీజినల్, డొమెస్టిక్ గమ్యస్థానాలకు వెళ్లే ఇండియన పైలట్లలో ఎక్కువ మంది అనుమతి లేకుండా లేదంటే సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా కాక్ పిట్ లో నిద్రపోతున్నట్లు తేలింది. అదీ, విమానం టేకాఫ్ అయిన 4 గంటల్లోని నిద్రకు ఉపక్రమిస్తున్నారట.
ఎందుకు పైలెట్లు నిద్రపోతున్నారు?
సుమారు 542 మంది భారతీయ పైలట్లపై ఈ సర్వే నిర్వహించింది సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్. వీరిలో 66 శాతం మంది విమానం మధ్యలో నిద్రపోతారని తేలింది. 54 శాతం మంది పైలట్లు ఎక్కువగా పగటి నిద్రతో బాధపడుతున్నారని వెల్లడించింది. 41 శాతం మంది మితమైన పగటి నిద్రతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. 74 శాతం మంది ఉదయం బయలుదేరడంతో పాటు వరుస విమాన ప్రయాణాలతో ఎంతో అలసట ఉంటుందని వెల్లడైంది. వారంలో ఒక రోజు సెలవు లేకుండా 168 గంటలు ప్రయాణించడం, పగలు, రాత్రి ఆల్టర్నేట్ డ్యూటీ పడటం మూలంగా పైలెట్ల నిద్రలో చాలా సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయని తెలిపింది. ఇది విమానయాన భద్రతకు సంబంధించిన సమస్యతో పాటు పైలెట్ల ఆరోగ్య సమస్య కూడా అని ఎన్టీవో అభిప్రాయ పడింది.
ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
నిద్ర సరిగా లేకపోవడం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తేలింది. సాధారణ నిద్ర విధానాలు పూర్తిగా తలకిందులు అయితున్నట్లు వెల్లడైంది. సిర్కాడియన్ రిథమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది. కొన్నిసార్లు నిద్ర రుగ్మతలకు కూడా దారితీసే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే లో వెల్లడి అయ్యింది. అంతేకాదు.. నిద్రలేమి మూలంగా పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. పైలెట్లలో చిరాకు, ఆందోళన, ఆకలి దప్పులు, షుగర్ క్రేవింగ్స్, అధిక కేలరీల తీసుకోవడం, డిప్రెషన్, మద్యం వాడటం లాంటి సమస్యలు ఏర్పాడుతున్నాయని సర్వేలో తేలింది. నిద్ర కారణంగా ఆరోగ్య సమస్యలు రాకూడదనే వైద్యులు రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రను సిఫార్సు చేస్తారు.
నిద్ర లేమితో ఎన్నో వ్యాధులు
సిర్కాడియన్ రిథమ్ 24-గంటల సైకిల్ ను అనుసరించే శారీరక, ప్రవర్తనా, ఆరోగ్య మార్పులను తలెత్తుతాయి. బాడీ క్లాస్ సరిగా పనిచేయని సమయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్ మీద ప్రభావం పడుతుంది. మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం ప్రమాదానికి కూడా దోహదం చేస్తుంది. ఐటీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.అందుకే పైలెట్లు సైతం నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్ తాజా సర్వే వెల్లడించింది. విమానయాన సంస్థలు సైతం పైలెట్ల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తల తీసుకోవాలని సిఫార్సు చేసింది. లేదంటే, మున్ముందు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.