చక్కెరతో పోలిస్తే తేనే చాలా ఆరోగ్యకరం. దానికి ఉత్తమ ప్రత్యామ్నాయం కూడా. చక్కెరతో పోల్చకపోయినా కూడా తేనె ఉత్తమమైనదనే చెప్పాలి. తరతరాలుగా తెలుగు వంటకాలలో, ఆహారంలో తేనె భాగమైపోయింది. చాలా మంది రోజు లేచిన వెంటనే గ్లాసు నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగుతారు. ఇవి శరీరం నుంచి విషాన్ని, ఇతర వ్యర్థాలను బయటికి పంపిస్తుందని నమ్మకం. అంతే కాదు బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుందని చెబుతారు. అయితే ప్రతి ఆహారం తినే పద్దతంటూ ఒకటుంది. ఎలా పడితే అలా తింటే అది కూడా కీడే చేస్తుంది. సద్గురు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఇటీవల ఆయన షేర్ చేసిన ఇన్ స్గాగ్రామ్ పోస్టులో తేనె గురించి తన అభిప్రాయాలను, ఎలా తింటే విషపూరితంగా మారుతుందో అన్న విషయాలను పంచుకున్నారు. 


ఆయన ఏం చెప్పారు?
సద్గురు తేనే గురించి మాట్లాడుతూ ‘తేనెను పచ్చిగా తీసుకుంటే ఒక రకమైన ప్రభావం పడుతుంది. అదే చల్లటి నీటితో కలిపి తీసుకుంటే మరో రకమైన ప్రభావం ఉంటుంది. గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే వేరే రకమైన ప్రభావం ఉంటుంది’ అన్నారు. ‘మనం ఎక్కువగా గోరువెచ్చని నీళ్లలో కలిపి తింటాము. ఎందుకంటే మన శరీర సిస్టమ్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటాము కనుక. అయితే మీరు తేనెను మరుగుతున్న నీళ్లలో వేస్తే మాత్రం అది విషపూరితంగా మారుతుంది. ఉడుకుతున్న ఏ పదార్థంలో కూడా తేనెను కలపకూడదు’ అని ఆధ్యాత్మిక గురువు వివరించారు.


పాశ్చాత్య సంస్కృతులలో పాన్ కేకులు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిలో తేనెను వాడతారు. దీని గురించి చెబుతూ తేనెను అధిక ఉష్ణోగ్రత వల్ల వండినట్లయితే అది విషపూరితంగా మారుతుంది అని వివరించారు. 


ఎలా తినాలి?
వేడి నీళ్లయినా, పాలు అయినా, పాన్ కేకులయినా కాస్త చల్లబడ్డాకే తేనేను జతచేయాలి. అదే తేనె తినడానికి ఉత్తమమైన మార్గం. పచ్చి తేనే నేరుగా తిన్నా మంచిదే. ఆయుర్వేదం ప్రకారం వేడి లేదా గోరు వెచ్చగా ఉండే తేనె స్లో పాయిజన్‌లా  శరీరంలో పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ‘అమా’ అనే రోగానికి ఇది దారితీస్తుంది. అంటే శరీరం విషపూరితం కావడం అని అర్థం. 


ఫుడ్ డేటా సెంట్రల్ ఇచ్చిన వివరాల ప్రకారం ఒక టేబుల్ స్పూను తేనెలో 64 కేలరీలు ఉంటాయి. అలాగే 17 గ్రాముల చక్కెర ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, నియాసిన్, పొటాషియం, జింక్ మొదలైన వాటితో నిండి ఉంటుంది. తేనెలో ఎన్నో అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, ఇతర ఆరోగ్యానికి మేలు చేసే సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి రోజుకో స్పూను తేనె శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. 



Also read: అధ్యయనాల ప్రకారం కిడ్నీల కోసం మీరు తినాల్సిన ఆహారాలు ఇవే


Also read: అచ్చు అలియా భట్‌లాగే ఉంది కదా, అదే ఆ పిల్లకు శాపమైంది, ఓ మోడల్ కథ