Rose Tea Health Benefits : మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా రోజ్​టీ గురించి తెలుసుకోవాల్సిందే. ఇది మీ నోటికి మంచి రుచిని అందించడమే కాకుండా.. బరువు తగ్గడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది సమర్థవంతమైన, వేగవంతమైన బరువును నిర్వహించడంలో హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేవలం శారీరక ప్రయోజనాలకే కాకుండా మానసిక ప్రయోజనాలకు కూడా ఇది హెల్ప్ చేస్తుందంటున్నారు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


రోజ్ టీని తయారుచేయడం చాలా సులభం. ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. గులాబీ రేకులను నీళ్లలో వేసి మరిగించి.. దానిని మీరు నేరుగా తాగవచ్చు. లేదంటే.. టీ పౌడర్, గులాబీ రేకులు వేసి దానిని వడకట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు. మీరు రోటీన్​ టీలకు భిన్నంగా ఆరోగ్యంగా ఉండేందుకు రోజ్​ టీ తాగవచ్చు. ఇది మీరు బరువు తగ్గడంలో చాలా ఎఫెక్టివ్​గా పని చేస్తుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఉత్తమమైన హెర్బల్ టీగా చెప్తారు. దీనిని క్రమంగా తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుందని, జుట్టు హెల్తీగా ఉంటుంది అంటున్నారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియకు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. దీని ఆహ్లాదకరమైన సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. 


బరువు తగ్గడంలో ఎలా హెల్ప్ చేస్తుందంటే.. 


రోజ్​ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మెరుగైన జీర్ణవ్యవస్థ బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలోని టాక్సిన్​లను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. ఇది మూత్రవిసర్జనపై ప్రభావం చూపిస్తుంది. మూత్ర నాళాల ఇన్​ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. మీరు టాక్సిన్స్​ను తొలగించగలిగితే.. మీ శరీరం ఆరోగ్యకరంగా బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 


రోజ్ టీ ఆరోగ్యకరమైన కెఫిన్​ కలిగిన పానీయాలకు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇది మీ పూర్తి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీకు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల మీరు చిరుతిళ్లకు దూరంగా ఉంటారు. తద్వార బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది మీ రోగనిరోధక శక్తిని బలపరస్తుంది. ఇది విటిమిన్ సితో సమృద్ధిగా నిండి ఉంటుంది. కాబట్టి దీనిని మీరు రోజ్​ టీ వివిధ ఇన్​ఫెక్షన్లుకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయం చేస్తుంది. 


Also Read : రోజూ ఉదయాన్నే బాదం, వాల్​నట్​ తింటున్నారా? అయితే ఇది మీకోసమే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.