Restaurant Style Apollo Fish Fry Recipe : రెస్టారెంట్​కి వెళ్లినప్పుడు స్టాటర్​తో ప్రారంభిస్తాము. అయితే వీటిని మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. చికెన్​తో మీరు ఇప్పటి వరకు ఎన్నో డిష్​లు ట్రై చేసి ఉండొచ్చు కానీ.. మీరు అపోల్ ఫిష్​ ఫ్రైని ట్రై చేశారా? పూర్తిగా రెస్టారెంట్ స్టైల్​లో మీరు ఈ డిష్​ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పైగా దీనికోసం ఏవెవో పదార్థాలు వేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో దొరికే పదార్థాలతోనే మీరు దీనిని హ్యాపిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ, రెస్టారెంట్ స్టైల్ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


అపోలో ఫిష్ - 500 గ్రామలు


కారం - 1 టీస్పూన్ 


ఉప్పు- 1 టీస్పూన్ 


పసుపు - చిటికెడు


అల్లం వెల్లుల పేస్ట్ - 1 టీస్పూన్ 


గుడ్డు - 1


మైదా పిండి - మూడు టేబుల్ స్పూన్లు


మొక్కజొన్న పిండి - మూడు టేబుల్ స్పూన్లు


నూనె - డీప్ ఫ్రైకి సరిపడనంత


వెల్లుల్లి - 2 టేబుల్ స్పూన్ల తురుము


అల్లం - 2 టేబుల్ స్పూన్ల తురుము


పచ్చిమిర్చి - 3


కరివేపాకు - 1 రెబ్బ


చైనీస్ చిల్లీ పేస్ట్ - 1 టీస్పూన్


రెడ్ చిల్లీ సాస్ - 1 టీస్పూన్


మిరియాల పొడి - అర టీస్పూన్


పసుపు - చిటికెడు


సోయా సాస్ - 1 టీస్పూన్


సాల్ట్ - తగినంత


గరం మసాలా - 1 టీస్పూన్


నిమ్మరసం - టీస్పూన్


కొత్తిమీర - గార్నిష్ 


పెరుగు - అర కప్పు


తయారీ విధానం


ముందుగా అపోలో ఫిష్​ని ఓ గిన్నెలోకి తీసుకోండి. దానిలో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఓ గుడ్డును వేరే గిన్నెలో పగలగొట్టి బాగా కలిపి.. దానిలో సగం ఫిష్​ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఇది ఫిష్​పై మంచి క్రిస్పీనెస్​ని ఇస్తుంది. ఇప్పుడు అదే గిన్నెలో మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. పిండి బాగా థిక్​ అయిందనుకుంటే కొన్ని నీళ్లు చల్లి కోటింగ్​కి సరిపడా లేయర్ వస్తుందని మీకు అనిపించేలా కలపండి.


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టండి. దానిలో నూనె పోసి బాగా వేడి చేయండి. దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్​ను వేయండి. నూనెలో వేసిన తర్వాత స్టౌవ్​ను మీడియం మంటకు మార్చేయండి. ఓ నాలుగు నిమిషాలు ఫిష్​ని కదపకుండా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేయడం వల్ల లేయర్ చేపలకు అంటుకుని ఊడిపోకుండా ఉంటుంది. నాలుగు నిమిషాల తర్వాత మరోవైపు తిప్పి చేపలను ఫ్రై చేసుకుని నూనె నుంచి తీసి బయటపెట్టండి.


ఇప్పుడు ఫ్రై పాన్ తీసుకుని దానిలో చేపలను ఫ్రై చేసిన నూనెను ఓ మూడు స్పూన్లు వేయండి. దానిలో సన్నగా తురిమి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం వేసి వేయించండి. దానిలో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. వెల్లుల్లి వేగుతున్నప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు దానిలో చైనీస్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, పసుపు వేసి వేయించండి. లైట్ సోయా సాస్, గరం మసాలా వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేయండి. సాస్​లలో సాల్ట్​ ఉంటుంది కాబట్టి మీరు కాస్త తక్కువగా వేసుకుంటే మంచిది. 


ఇలా చేసుకున్న గిన్నెలో మీరు పెరుగు వేయాల్సి ఉంటుంది. అయితే కొందరు పెరుగు, చేపలు కలిపి తినరు కాబట్టి మీరు పెరుగు వేయకూడదనుకుంటే మీరు దానిలో నీరు వేయొచ్చు. అయితే రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్​ ఫ్రైలో కచ్చితంగా పెరుగు ఉపయోగిస్తారు. మిశ్రమాలు అన్ని కలిసేలా పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు గ్రేవీ కాస్త థిక్​గా మారింది అనుకున్నప్పుడు ముందుగా డీప్​ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ వేసి కలిపేయండి.


గ్రేవీ లైట్​ ఉంటే ఫిష్ ముక్కల్లో క్రిస్పీనెస్ తగ్గుతుంది. అలా అని బాగా థిక్​గా ఉంటే ఫిష్​కి గ్రేవీ అంటుకోదు. కాబట్టి.. మీరు మీడియంగా గ్రేవీ ఉన్నప్పుడే ఫిష్ ముక్కలు వేయాలి. వాటిని బాగా మిక్స్ చేయాలి. కొత్తిమీరు వేసి గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ ఫ్రై రెడీ. మీరు పెరుగు ప్లేస్​లో నీరు ఉపయోగిస్తే దీనిలో కచ్చితంగా నిమ్మరసం ఉపయోగించండి. ఇది కాస్త డిష్​కి పులుపు రుచిని కూడా జోడిస్తుంది. ఇంకేందుకు ఆలస్యం ఈ సండే అపోల్ ఫిష్​ ఫ్రైతో కానిచ్చేయండి.


Also Read : టేస్ట్ అదిరిపోయే కోడి పలావ్.. ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ