Republic Day 2025 Speech : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపు అన్ని పాఠశాలలో సెలబ్రేషన్స్ చేస్తారు. పెద్దలు, టీచర్లతో పాటు.. పిల్లలు కూడా రిపబ్లిక్ డే స్పీచ్‌కి సిద్ధమవుతారు. ఈసారి సెలబ్రేషన్స్‌కి మీరు కూడా స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలో.. ఎలా స్పీచ్ ఇవ్వాలో.. స్క్రిప్ట్ ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం.
స్పీచ్ స్టార్ట్ చేసే ముందు కచ్చితంగా వేదికపై ఉన్న గెస్ట్‌లకు, టీచర్స్‌కు, మీ తోటి విద్యార్థులకు విష్ చేయాలి. తెలుగులో చెప్పాలనుకుంటే గుడ్ మార్నింగ్ టీచర్స్, పేరెంట్స్ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్‌లో ప్రారంభించాలనుకుంటే రెస్పెక్టెడ్ టీచర్స్, పేరెంట్స్, అండ్ ఫెలో స్టూడెంట్స్ అంటూ స్పీచ్ ప్రారంభించవచ్చు.
సమానత్వం..
తర్వాత ఈ ఏడాది మనం ఎన్నో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో చెప్తూ.. స్పీచ్ మొదలు పెట్టొచ్చు. ''ఈ రోజు మనం దేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన, స్పెషల్ డే జరుపుకోవడానికి సమావేశమయ్యాము. భారదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రిపబ్లిక్ డే అనేది మన రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని సూచిస్తుంది. ఇది మనకి, దేశ అభివృద్ధికి మార్గనిర్దేశాన్ని ఇస్తుంది. మన రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అందిరికి అందేలా చూడాలి. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. '' అని చెప్పొచ్చు.
సమరయోధుల త్యాగాలు..
''సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. స్పీచ్‌ని కంటిన్యూ చేయాలి. ''ఈ రోజు మనం ధైర్యంగా ఇక్కడ నిలబడుతున్నామంటే అది మన స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన వారిదే. గణతంత్ర వేడుకల సందర్భంగా మనం వారిని గుర్తుచేసుకోవాలి. అదే వారికి మనం ఇచ్చే గౌరవం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ వంటి ఎందరో జాతీయ నాయకుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారి ధైర్యం, పట్టుదల, నిస్వార్థాన్ని మనం అలవరచుకుని.. మంచి భవిష్యత్తుకోసం పనిచేయాలి.
భారతదేశపు యువ పౌరులుగా, దేశ ప్రగతికి మనం అందరం తోడ్పడాలి. అది మన కర్తవ్యం. బాధ్యతాయుతంగా, విద్యావంతులుగా దేశానికి మనవంతు సాయం చేయాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సాహిస్తూ.. అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఎవరినీ తక్కువగా చూడకూడదు. మనం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు గుర్తించి.. శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో మనవంతు కృషి చేద్దాం. మన రాజ్యాంగాన్ని, వాటి విలువలను పరిరక్షిస్తానని మనమందరం ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను.''
జైహింద్...
అంటూ స్పీచ్‌ని ముగించవచ్చు.
స్పీచ్ చెప్పేప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఇప్పుడు చూసిన స్క్రిప్ట్‌ని మీకు నచ్చినట్లు మార్చుకుని.. మీ స్టైల్లో చెప్తే.. ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. గణతంత్ర దినోత్సవం స్పీచ్‌కు మీరు ప్రిపేర్ అయ్యి చెప్పేయండి.
Also Read : పేరెంట్స్ అలెర్ట్.. మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త, న్యూ రూల్స్‌తో షాక్ ఇవ్వబోతున్న గవర్నమెంట్