భగత్ సింగ్.. పరాయి పాలన నుంచి భరతమాత దాస్యపు సంకెళ్లు తెచ్చేందుకు ప్రాణాలను అర్పించిన వీర యోధుడు. నా జీవితం దేశానికే అంకితం అంటూ ఉరితాడును ముద్దాడిన ధీశాలి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన అనితర సాధ్యమైన పోరాట పటిమ చూస్తే.. భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం లక్షలాది మంది యువతకు స్పూర్తిదాయకం. భరతమాత విముక్తి పోరాటంలో ఆయన చేసిన సాహసం అనన్యసామాన్యం. 23 ఏండ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్.
1907 సెప్టెంబర్ 28 జన్మించాడు భగత్ సింగ్. అప్పటికే ఆయన కుటుంబం స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నది. కుటుంబ సభ్యుల అడుగుజాడలో నడిచిన ఆయన.. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై తిరుగుబాటు చేశాడు. 23 సంవత్సరాల వయసులోనే ఉరితీయబడ్డాడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి భగత్ సింగ్‌తో పాటు సహచర విప్లవకారులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో బ్రిటీష్ పాలకులు ఉరి తీశారు. ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా.. వారు అధైర్య పడలేదు. చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని.. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. అందుకే ఆ రోజును ‘షహీదీ దివాస్’గా జరుపుకుంటారు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురు ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటారు.
ఇవాళ భగత్ సింగ్ జన్మదినం. ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిద్దాం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు భగత్ సింగ్ ని కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయక సూక్తులను అందిస్తున్నాం. వీటిని మీ సోషల్ మీడియాలో పోస్టు చేసుకోండి.
‘‘విప్లవం కలహాలతో కలవలేదు. బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి’’
- భగత్ సింగ్
‘‘నేను ఒక మనిషిని, మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించనవే’’
- భగత్ సింగ్
‘‘కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు.. విప్లవానికి అవసరమైన రెండు విశిష్ట లక్షణాలు’’
- భగత్ సింగ్
‘‘మనుషులను చంపగలరేమో.. కానీ వారి ఆదర్శాలను చంపలేరు’’
- భగత్ సింగ్
‘‘జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్ని ప్రేమిస్తాం.. మేం మరణించి..
ఎర్రపూల వనంంలో పూలై పూస్తాం..
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం..
నిప్పురవ్వల మీద నిదురిస్తాం’’
- భగత్ సింగ్
‘‘దేశం కోసం చనిపోయేవారు..
ఎల్లకాలం బతికే ఉంటారు’’
- భగత్ సింగ్
‘‘తిరుగుబాటు అనేది ఒక విప్లవం కాదు. అది చివరికి ముగింపునకు దారి తీయవచ్చు.’’
- భగత్ సింగ్
‘‘ప్రేమ ఎల్లప్పుడూ మనిషి పాత్రను ఉద్దరిస్తుంది. ఇది అతన్ని ఎప్పటికీ తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది‘‘.
- భగత్ సింగ్
‘‘వారు నన్ను చంపవచ్చు. కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు. నా ఆత్మను దహించలేరు’’
- భగత్ సింగ్
‘‘చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి’’
- భగత్ సింగ్
‘‘ప్రేమికులు, వెర్రివాళ్లు, కవులు ఒకే ముడిసరుకుతో తయారవుతారు’’
- భగత్ సింగ్