టమోటా కెచప్ ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా మన ఆహారంలో భాగమైపోయింది. ఒకప్పుడు దీన్ని ఔషధాల రూపంలో కూడా వాడేవారు. కానీ ఇప్పుడు ప్రిజర్వేటివ్స్, సోడియం ఎక్కువ వేసి అధిక కాలం పాటూ నిల్వ ఉండేలా తయారు చేస్తున్నారు. దీనివల్ల అనారోగ్యమే తప్ప ఆరోగ్యం కలగదు. రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును, శరీరంలో కొవ్వు స్థాయిలను పెంచేస్తాయి. కాబట్టి ఇంట్లోనే తాజాగా టమాటో కెచప్‌ను తయారు చేసుకొని తింటే మంచిది. దీన్ని తయారు చేయడం అంత కష్టమైన పనేం కాదు. టమాట పచ్చడి చేసినంత సులువు. బయట కొన్న కెచప్ కన్నా పిల్లలకు ఇలా తాజాగా ఇంట్లో చేసినది పెట్టడమే మంచిది.


కావాల్సిన పదార్థాలు
టమోటాలు - ఒకటిన్నర కిలోలు 
ఉల్లిపాయ పొడి - 1/2 స్పూను 
వెల్లుల్లి రెబ్బలు - ఆరు 
ఆపిల్ సెడర్ వెనిగర్ - రెండు స్పూన్లు 
బీట్రూట్ - అర ముక్క
ఉప్పు - రుచికి సరిపడా 
తాటి బెల్లం - రెండు స్పూన్లు 
నూనె - రెండు స్పూన్లు 
ఎర్ర కారం - ఒక స్పూను


తయారీ ఇలా...
1. కళాయిని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఇది వండినంత కాలం మీడియం మంట మీదే స్టవ్ ఉంచాలి. 
2. కళాయిలో ఆలివ్ ఆయిల్ వేయాలి. అందులో తరిగిన బీట్రూట్, టమోటా ముక్కలను వేసి ఉడికించాలి.
3.  అవి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. అది బాగా మెత్తగా ఉడికాయి అనుకున్న తర్వాత స్టవ్ కట్టేయాలి. 
4. టమోట మిశ్రమాన్ని తీసి మిక్సీ జార్లో వేయాలి. అందులో పైన చెప్పిన మిగతా పదార్థాలను కూడా వేసి కొంచెం ఆలివ్ నూనె, నీళ్లు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
5.  అంతే టమోటో కెచప్ రెడీ అయినట్.
6. ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటూ నిల్వ ఉంటుంది. నిల్వ ఉండేందుకు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి ఇది ఎంతో ఆరోగ్యకరం. 






Also read: ఆ ఊర్లో ఫ్రిడ్జ్‌ల‌ అవసరం లేదు - మనుషులంతా క్యాబేజీల్లా రెడీ అవుతారు