సంక్రాంతి పండుగ వచ్చిందటే వంటగది ఘుమఘమలాడాల్సిందే. పులిహోర, బూరెలు కచ్చితంగా ఉంటాయి. ఎక్కువ మంది పూర్ణం బూరెలు చేసుకుంటారు. నిత్యం పూర్ణం బూరెలు అంటే బోరు కొడుతుంది కదా. ఈసారి సింపుల్‌గా ప్రసాదం బూరెలు చేసుకోండి. పిల్లలకు చాలా నచ్చుతాయి. చేయడం కూడా చాలా సులువు.
కావలసిన పదార్థాలు
మినప్పప్పు - ఒక కప్పు
బియ్యం - ఒక కప్పు
నెయ్యి - రెండు స్పూనులు
నీళ్లు - ఒక కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, మరో గిన్నెలో బియ్యం నానబెట్టుకోవాలి.
2. నాలుగు గంటల పాటూ నానాక రెండింటినీ మిక్సిలో వేసి రుబ్బుకోవాలి.
3. మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ అందంగా కాకుండా రుబ్బుకోవాలి.
4. ఆ పిండిని తీసి ఒక గిన్నెలో వేసి ఒక స్పూను ఉప్పువేసి కలపాలి. దాన్ని ఒక గంట పాటూ పక్కన పెట్టేయాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి వేయించాలి.
6. అయిదు నిమిషాలు వేగాక అందులో మరగకాచిన వేడి నీళ్లను ఒక గ్లాసు వేయాలి.
7. అడుగంటిపోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఒక కప్పు పంచదార కూడా వేయాలి.
8. ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసి కలుపుతూనే ఉండాలి.
9. చిన్న మంట మీద ఉడికిస్తే రవ్వ మాడిపోకుండా బాగా ఉడుకుతుంది. మిశ్రమం అంతా దగ్గరగా అయి ఉండలు చుట్టేందుకు వీలుగా మందంగా మారుతుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి.
10. బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
11. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.
12. బొంబాయి రవ్వను బూరెల సైజులో ఉండలుగా చుట్టుకుని మినప - బియ్యం పిండిలో ముంచి నూనెలో వేయించాలి.
13. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే ప్రసాదం బూరెలు సిద్ధమైనట్టే.
Also read: మిస్ యూనివర్స్ పోటీలో భారతీయ అందం దివితా రాయ్, ఎవరీమె?