‘బీన్స్’ను లెగ్యూమ్స్ అని కూడా అంటారు. వీటిలో అన్ని రకాల అమైనో ఆసిడ్స్ ఉంటాయి. అంతేకాదు మాంసాహారంలో దొరికే అమైనో ఆసిడ్స్ కంటే కూడా ఇందులో ఎక్కువే ఉంటాయని చెప్పవచ్చు.  వివిధ ఆకారాలు, పరిణామాలు, రంగులు, రుచులతో దొరుకుతాయి. బీన్స్ ఏ రకమైనవైనా సరే కానీ పోషకాలు మాత్రం అన్నింటిలో దాదాపు ఒకే రకంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం నుంచి రోగనిరోధక పెంచే వరకు కూడా బీన్స్ అంటే పవర్ హౌజ్ వంటివి. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఇన్ స్టాగ్రాం పోస్ట్ లో బీన్స్ ప్రయోజనాలెన్నింటినో వివరించారు.



  1. బీన్స్లో ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. శరీరం నుంచి టాక్సిన్స్ బయటికి పంపించడం, రక్తాన్ని శుభ్రపరచడం వంటి అనేక జీవక్రియలకు కావల్సిన శక్తిని ఇస్తాయి. మనల్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి.

  2. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బీన్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. బీన్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా బీన్స్ తీసుకున్నపుడు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా బాగా తగ్గుతుంది. బీన్స్ లో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా నిదానంగా జీర్ణం అవుతాయి. అందువల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అంత త్వరగా పెరిగిపోవు.

  3. బీన్స్ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. రోజూ శరీరానికి కావల్సిన కాల్షియం బీన్స్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. ఇది ఎముకలను బలపరుస్తాయి.

  4. బీన్స్ లో ఉండే అనేక కాంపౌండ్స్, ఇన్హిబీటర్స్ క్యాన్సర్ ను నివారించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి.

  5. బీన్స్ లో ఉండే ప్రొటీన్లు మాంసాహారం ద్వారా లభించే ప్రొటీన్లకు దాదాపు సమంగా ఉంటాయి. ప్రతి సర్వింగ్ లో 8 నుంచి 10 గ్రాముల వరకు ప్రొటీన్ అందుతుంది. అన్నంతో కలిపి తింటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ తో పూర్తి స్థాయి మీల్ అవుతుంది.

  6. బీన్స్‌లో ఉండే బయోటిన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. జుట్టు పెళుసుబారిన వారికి ఇది మంచి పరిష్కారం. రోజూ ఏదో ఒక రకమైన బీన్స్ ఆహారంలో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా, మందంగా పెరిగే అవకాశం ఉంటుంది.

  7. బీన్స్ లో ఉండే ఫోల్లేట్ గర్భిణులకు కూడా చాలా మంచిది. బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డ ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదం చేస్తుంది.

  8. ఫ్యాట్ తక్కువగా ఉండే బీన్స్ లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి శరీర బరువును కూడా అదుపులో ఉంచుతాయి. ప్రొటీన్ ఎక్కువగా బీన్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగి తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. కనుక బరువుతగ్గడం సులభమవుతుంది. కండరాలు బలంగా తయారయ్యేందుకు బీన్స్ దోహదం చేస్తాయి.  


Also Read: అతిగా యోగా చేస్తున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.