Rashmika Mandanna Sleeveless Blouse Saree Look : కాలేజ్​కి వెళ్లే అమ్మాయిలు కాలేజ్ ఫెస్ట్​ల సమయంలో చీరలు కట్టుకుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగల సమయంలో చీరను కట్టుకున్నా.. స్టైలిష్​గా కనిపించాలనుకుంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే మీరు కచ్చితంగా రష్మిక మందన్నా లుక్స్​ని ఫాలో అయిపోవాల్సిందే. ఎందుకంటే రష్మిక దాదాపు తను కట్టుకునే చీరలపై స్లీవ్​ లెస్​ బ్లౌజ్​నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. మరి ఆ లుక్స్​ మీరు ఎలా రీక్రియేట్ చేయొచ్చో.. ఇప్పుడు చూసేద్దాం. 


హెయిర్ బన్..




స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా హెయిర్ బన్ వేసుకుని.. సింపుల్​గా రెడీ అవ్చొచ్చు. అలాగే మెడలో ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా.. చెవులకు మాత్రం పెద్ద ఝుంకాలు పెట్టుకుంటే బాగుంటుంది. లైట్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు డార్క్ ఐషాడో వేసుకుంటే మీ లుక్స్ పిక్చర్​ పర్​ఫెక్ట్​గా ఉంటాయి. 


క్యూట్ హ్యాండ్ బ్యాగ్​తో.. 




స్లీవ్ లెస్ బ్లౌజ్​కి ఫ్రెంట్​ బికినీ షేప్​లో వచ్చేలా డిజైన్ చేయించుకుంటే స్టైలిష్​గా కనిపిస్తారు. అలాగే వెనుక ఇలాంటి కుచ్చులు పెట్టుకుంటే ఫంకీగానూ ఉంటుంది. ఈ లుక్​ని మీరు గులాబీలతో స్లే చేయవచ్చు. అలాగే మెడలో చోకర్, చేతికి హ్యాండ్ పెట్టుకుంటే బాగా కనిపిస్తారు. 


బీడ్స్ కలెక్షన్​తో




పుష్ప 2 ప్రమోషన్స్​లో భాగంగా.. రష్మిక కట్టుకున్న బ్లూ శారీ అందరి మనసు దోచేసింది. ఈ శారీ లుక్​ని కూడా స్లీవ్​లెస్​ బ్లౌజ్​తోనే పెయిర్ చేసింది. అయితే ఈసారి మెడలో ఎలాంటి ఆభరణాలు లేకుండా.. చెవులకు, చేతులకు మాత్రం బీడ్స్​తో కూడిన జ్యూవెలరీ పెట్టుకుంది రష్మిక. సింపుల్​గా, క్యూట్​గా, ట్రెండీగా కనిపించాలంటే ఇవి బెస్ట్. 


శాటిన్ శారీతో.. 




శాటిన్ చీరను కూడా ఇలాంటి స్లీవ్​ లెస్​ బ్లౌజ్​తో పెయిర్​ చేసుకోవచ్చు. స్టోన్స్​తో కూడిన ఇయర్ రింగ్స్, చేతికి బ్రాస్​లెట్​ని రష్మిక పెయిర్ చేసింది. హెయిర్​ను లీవ్ చేసి.. గోల్డెన్ మేకప్​ లుక్​లో మీరు కూడా అందంగా ముస్తాబు కావొచ్చు.


ఎల్లోశారితో ఎలా పెయిర్ చేయవ్చచంటే..




రష్మిక ఈ స్లీవ్​ లెస్​ బ్లౌజ్​ని ఈసారి బిగ్ రిబ్బన్స్​తో పెయిర్​ చేసింది. హెయిర్​ని కర్ల్స్​ లేకుండా స్ట్రైయిట్​ లుక్​లో ఉంచుకుంది. మెడకు చౌకర్ పెట్టుకుని.. చెవులకు స్టోన్స్ ఇయర్ రింగ్ పెట్టుకుంది. 


డీప్ నెక్




స్లీవ్​లెస్​ బ్లౌజ్​ని డీప్​ నెక్​గా కూడా మీరు కుట్టించుకోవచ్చు. ఇలాంటి డీప్​నెక్ వేసుకున్నప్పుడు మెడలో పెద్ద నెక్లెస్​ను వేసుకోవచ్చు. కాటుక పెట్టుకుంటే మీరు మీ లుక్​ మరింత అందంగా మారిపోతుంది. 


పండుగల సమయంలో.. 




పండులగల సమయంలో మీరు ఇలాంటి చీరను ఎంచుకుంటే.. స్లీవ్​లెస్​ లుక్​ని ట్రెడీషనల్​గా మార్చుకోవచ్చు. మెడలో, చెవులకు, చేతికి జ్యూవెలరీ పెట్టుకోవాలి. అలాగె చెంపసవరాలు మీ లుక్​ని మరింత అందంగా మార్చేస్తాయి. తలలో పూలు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని ఇలా అందంగా ముస్తాబైతే.. పండుగ శోభ అంత మీ దగ్గరే ఉంటుంది. 




మరి ఇంకేమి ఆలస్యం. మీరు కూడా ఈ పండుగల సమయంలో, ఫంక్షన్ల సమయంలో స్లీవ్​ లెస్​ బ్లౌజ్​లతో అందంగా శారీ లుక్​ని పుల్​ చేయవచ్చు. మరిన్ని లుక్స్​కోసం మీరు రష్మిక మందన్న ఇన్​స్టాని ఫాలో అవ్వండి.



Also Read : ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు సింపుల్​గా ముస్తాబై, స్టన్నింగ్​గా కనిపించాలంటే కీర్తి సురేష్​ని ఫాలో అయిపోండిలా