అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షా బంధన్. ఈ రోజున కచ్చితంగా స్వీటు వండాల్సిందే. చాలా మంది స్వీటు కొనేసి పండుగ చేసేస్తారు. కానీ ఇంట్లోనే చక్కగా సింపుల్‌గా చేసే రెసిపీలు ఇవిగో. ఇరవై నిమిషాల్లో ఈ స్వీట్లు రెడీ అయిపోతాయి. 


బాదం హల్వా
కావాల్సిన పదార్థాలు
బాదం పప్పులు - ఒక కప్పు
పంచదార - అర కప్పు
నెయ్యి - అర కప్పు
నీళ్లు - అయిదు కప్పులు
కుంకుమ పువ్వు - ఆరేడు రేకులు


తయారీ ఇలా
1. బాదం పప్పును నానబెట్టాలి. నాలుగైదు గంటలు నానబెడితే తొక్క వచ్చేస్తుంది. 
2. బాదం పప్పులను ఉడికించాలి. బాగా ఉడికాక తీసి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. అరకప్పు నీళ్లు పోసి బాదం పేస్టును చేయాలి. 
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పావు కప్పు నీళ్లు పోయాలి. 
4. చక్కెరను వేసి పంచదార కరిగిపోయే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి.
5. ఇందులో కుంకుమ పువ్వు కూడా వేయాలి. పంచదార పాకాన్ని పక్కన పెట్టాలి. 
6.ఇప్పుడు వేరే కళాయిని స్టవ్ మీద పెట్టాలి. 
7. అందులో అరకప్పు నెయ్యి వేయాలి. 
8. నెయ్యి కరిగాక ముందుగా పేస్టు చేసుకున్న బాదం మిశ్రమాన్ని వేసి కలపాలి. 
9. అయిదు నిమిషాలు ఉడికించాక పంచదార పాకాన్ని కూడా వేసి కలపాలి. అలా కాస్త గట్టిగా మారేవరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. 
10. పైన పిస్తా, జీడిపప్పు చల్లుకుంటే టేస్టీ బాదం హల్వా రెడీ.
 
............................


బేసన్ లడ్డూ 
కావాల్సిన పదార్థాలు
శెనగపిండి - మూడు కప్పులు
పంచదార - మూడు కప్పులు 
నెయ్యి - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
జీడిపప్పు పలుకులు - ఓ పది
కిస్ మిస్‌లు - పది


తయారీ ఇలా 
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. 
2. నెయ్యి కరిగాక అందులో శెనగపిండి వేసి కలపాలి.
3. చిన్న మంట పెట్టి వండాలి. లేకుంటే శెనగపిండి మాడిపోతుంది. 
4. పచ్చి వాసన పోయే వరకు శెనగపిండిని నెయ్యిలో వేయించాలి. 
5. తరువాత పంచదార వేసి కలపాలి. 
6. అందులో జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి.
7. యాలకు పొడి కూడా వేసి కలపాలి. 
8.శెనగపిండి రంగు మారి కాస్త డార్క్‌గా, ముద్దగా మారాక స్టవ్ కట్టేయాలి. 
9. చల్లారాక ఉండలుగా చుట్టుకోవాలి.
10. అంతే బేసన్ లడ్డూ రెడీ. చేయడం చాలా సులవు కదా. రాఖీ పండుగకు ఈ రెసిపీ చేయండి.  


చెల్లి అన్నకి రాఖీ కట్టాక హారతి ఇచ్చి, స్వీటు తినిపించాలి. ఇలా ఇంట్లో చేసిన స్వీటు తినిపిస్తే పండుగ మరింత స్పెషల్ గా మారుతుంది.  రక్షా బంధన్, రాఖీ పౌర్ణమి అని పిలుచుకునే ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. పురాణ కాలం నుంచి ఈ వేడుకను నిర్వహించుకుంటున్నారు భారతీయులు.  


Also read: ఈ చిత్రంలో ఎన్ని పాండాలున్నాయో అర నిమిషంలో చెప్పండి, కేవలం 10 శాతం మందే గుర్తించగలరు


Also read: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం