బంగాళాదుంప చిప్స్ లేదా ఫ్రై అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయాలలో ఇదీ ఒకటి. చవకైనవి కాబట్టి విరివిగా వాడకం ఉంటుంది. ఉడికించిన, కాల్చిన, కూర, చిప్స్ లేదా ఫ్రై రూపంలో ఎలా తిన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అయితే బంగాళాదుంపలు అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. అందుకు కారణం ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అది మాత్రమే కాదు గ్లైసిమిక్ కలిగి ఉంటుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మధుమేహులు వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని చెప్తుంటారు. అయితే వాటిలో నిజమెంత?


బంగాళాదుంపలు ఆరోగ్యకరం కాదా?


పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళాదుంపలు ఆరోగ్యకరమైనవి, పోషకమైనవి. ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బి6 వంటి ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. పొటాటో అనారోగ్యమని భావించడానికి ఒక కారణం ఉంది. అది దుంపలు వండే విధానం సరిగా ఉండకపోవడమే. అన్నీ దుంపలు ఒకేలా ఉంటాయి. అవి ఆరోగ్యకరమా కాదా అనేది మనం వండుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది.


ఉదాహరణకు నూనెలో వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, కాల్చిన దుంపలు పోషకమైనవి కావు. ఎందుకంటే అధిక నూనెలో వేయించిన ఆహారం ఆరోగ్యానికి ఎప్పటికీ మంచిది కాదు. బంగాళాదుంపలు వీలైనంత ఆరోగ్యంగా తినాలనుకుంటే డీప్ ఫ్రై చేయడానికి బదులుగా కాల్చుకోవచ్చు లేదంటే ఉడకబెట్టుకోవచ్చు. ఇలా మాత్రమే కాదు ఎయిర్ ఫ్రైయర్ లో ఆవిరితో ఉడికించుకోవచ్చు.


కార్బోహైడ్రేట్లు హానికరమా?


బంగాళాదుంపల్లోని కార్బోహైడ్రేట్లు ప్రయోజనమే. ఇవి మెదడు, శరీరానికి శక్తికి ప్రధాన వనరు. తీవ్రమైన వ్యాయామం చేసే సమయంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా అవసరం. కార్బోహైడ్రేట్లు కూడా ప్రోటీన్, కొవ్వుల కంటే వేగంగా జీర్ణమవుతాయి.


బంగాళాదుంపలు వండే విధానం మాత్రమే కాదు వాటిని దేనితో జోడించి వండుకుంటున్నారో కూడా ముఖ్యమే. బటర్ లేదా మయో వంటి అధిక కేలరీలు ఉండే పదార్థాలతో దుంపలు జత చేయడం నివారించాలి.


రోజూ బంగాళాదుంపలు తినొచ్చా?


రోజూ బంగాళాదుంపలు తినడం వల్ల లాభాలు పొందవచ్చు. డీప్ ఫ్రై చేయకుండా ఉంటే మంచిది. సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలతో జత చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులోని పీచు, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొటాషియం కండరాల పనితీరు నియంత్రిస్తుంది. గుండెకి ఆరోగ్యాన్ని ఇచ్చే ముఖ్యమైన పోషకం ఇది.


బరువు తగ్గుతారా?


బరువు తగ్గే డైట్ ఫాలో అవుతున్నప్పుడు బంగాళాదుంపలు తినొచ్చా అంటే తినొచ్చని అంటున్నారు నిపుణులు. అయితే అతిగా తినకుండా కొద్ది మొత్తంలో తీసుకోవాలి. అధిక కేలరీలు ఉండేలా ఫ్రై చేసుకుని తినకూడదు. చీజ్ వేసుకుని అసలు తీసుకోకూడదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పిల్లలు పుట్టడం కోసం IVF ట్రీట్మెంట్ కి వెళ్తే డాక్టర్ చేసిన పని ఇది