ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. లేకపోతే.. ఈ మహిళ తరహాలోనే మారిపోతారు. చంపడానికి కూడా వెనకాడరు. ఔనండి, నిజం. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఓ అరుదైన మానసిక సమస్యతో బాధపడుతున్న మహిళ.. నిద్రలేమితో విచక్షణ కోల్పోయింది. తనకు తెలియకుండానే.. భర్తను, బిడ్డపై దాడి చేసింది.
డెర్బీషైర్‌లోని చెస్టర్ఫీల్డ్‌కు చెందిన లారా అనే మహిళ.. పోస్ట్‌పార్ట్ సైకోసిస్ (ప్రసవం తర్వాత వచ్చే మానసిక సమస్య)తో బాధపడుతోంది. దాని వల్ల ఆమెలో విపరీతంగా ఆలోచించేంది. తీవ్రమైన హాలుసినేషన్‌తో ఏవేవో ఊహించుకొనేది. తనపై ఎవరో దాడి చేస్తున్నట్లు, హత్యకు ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకొనేది. కొన్నిసార్లు ఎవరో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కూడా భావించేది. దీంతో ఆమె నిద్రపోవాలంటే భయపడేది. అలా ఆమె సుమారు రెండు రోజులు నిద్రలేకుండా గడిపింది. దాదాపు 40 గంటలు నిద్రలేకపోవడంతో ఆమె మానసిక స్థితి అదుపు తప్పింది. తనను ఎవరో వెంటపడుతున్నట్లు.. గట్టిగా కేకలు పెట్టేది. ఆ ఊహలు వచిన్నప్పుడల్లా ఆమె ఉద్వేగానికి గురయ్యేది. ఆ పిచ్చితనంతో ఆమె తన భర్తతోపాటు అప్పుడే పుట్టిన పసిబిడ్డను సైతం చంపాలనుకుంది. లక్కీగా భర్తకు ఆమె సమస్య గురించి తెలియడంతో అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నాడు. బిడ్డను ఆమెకు దూరంగా ఉంచడంతో ఎలాంటి హానీ కలగలేదు.
పోస్ట్‌పార్టం సైకోసిస్ అంటే?
ఈ పోస్టుపార్టం సైకోసిస్ అనేది ప్రతి 1000 మంది తల్లుల్లో ఒకరికి వచ్చే అరుదైన మానసిక జబ్బు. ముఖ్యంగా ప్రసవం అనంతరం కొద్ది మంది తల్లుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా హాలూసినేషన్స్(వాస్తవానికి దగ్గరగా ఉండే ఊహలు), మానసిక ఒత్తిడి, అతిగా ఆలోచించడం, వింతగా ప్రవర్తించడం, మూడ్ సరిగ్గా లేకపోవడం వంటివి గమనించవచ్చు. అయితే దీనికి కారణాలను డాక్టర్లు పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా వంటి జబ్బులు ఉన్నవారు మాత్రమే ఈ పరిస్థితికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
లారా భర్త స్పందిస్తూ.. డాక్టర్లు సలహా మేరకు ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపాడు. పోస్ట్‌పార్టం సైకోసిస్ అనే పరిస్థితి వల్లే ఆమె అలా ప్రవర్తిస్తుందని చెప్పారు. సైకోసిస్ సమస్య పరిష్కారానికి డాక్టర్లు కొన్ని మందులు సూచించారని, టాక్ థెరపీతోనూ ఆమె మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చని పేర్కొన్నారని తెలిపాడు. చూశారుగా.. నిద్రలేమి, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలు వల్ల మనుషుల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, బీ కేర్ ఫుల్.
Also Read : కేకులు, కూల్ డ్రింక్స్, గమ్లతో జాగ్రత్త.. వాటిలోని స్వీటెనర్ ప్రాణాలకే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం