రోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఆఫీసులో పనిచేయడం కంటే.. వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయడమే కష్టమనే భావన ఉద్యోగుల్లో ఉంది. ఎందుకంటే.. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు 24x7 అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో బాసులు ఎక్కువ పని చేయించుకుంటున్నారు. ఫలితంగా షిఫ్ట్ సమయం ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయాల్సి వస్తోంది. ‘‘ఇంట్లోనే ఉన్నారుగా.. ఈ పని చేసేయండి’’ అనే డైలాగ్ ఈ రోజుల్లో సాధారణమైపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. షిఫ్ట్ ముగిసినా సరే బాసులు ఏదో ఒక మెసేజ్, మెయిల్స్ పంపిస్తూ పని చెబుతున్నారని.. పరిస్థితులు దయనీయంగా ఉన్న నేపథ్యంలో వారు చెప్పినట్లే పనిచేస్తున్నామని అంటున్నారు. దీని వల్ల పని ఒత్తిడి పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కొత్త రూల్‌ అమల్లోకి వచ్చింది. ఉద్యోగి పనివేళలు (షిప్ట్) ముగిసిన తర్వాత బాసులు మెసేజ్ లేదా మెయిల్స్ పంపితే శిక్ష తప్పదు. ఈ రూల్ పెట్టింది మన ప్రభుత్వం కాదండోయ్.. పోర్చ్‌గీస్ ప్రభుత్వం.


పోర్చ్‌గల్‌లో ఇంకా ఆఫీసులు తెరవలేదు. దీంతో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే, బాస్‌లు పనివేళల తర్వాత కూడా ఏదో ఒక మెసేజ్ పెడుతూ అదనంగా పని చేయించుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కార్మిక చట్టం ప్రకారం.. ఇకపై ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్న ఉద్యోగులకు షిఫ్ట్ తర్వాత మెసేజ్‌లు, మెయిల్ చేసి ఒత్తిడి తెస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పని తర్వాతే కాదు.. షిఫ్ట్‌కు ముందు కూడా బాసులు ఎలాంటి మెసేజులు పంపించకూడదు. కేవలం ఆఫీస్ సమయంలో మాత్రమే పని చేయించుకోవాలి. అత్యవసర సమయాల్లో మాత్రం ఈ రూల్ నుంచి ఉపశమనం ఉంటుందని, ఇందుకు తగిన కారణం చెప్పాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 


Also Read: చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్‌, కాఫీలతో మాత్రలు వేసుకోవచ్చా?


10 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉండే సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. అది మాత్రమే కాదు.. బాస్‌లు తమ కింది ఉద్యోగులపై నిఘా పెట్టడాన్ని కూడా ప్రభుత్వం తప్పుబట్టింది. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సిబ్బంది పని చేస్తున్నారా.. లేదా అని తెలుసుకోడానికి ప్రతి నిమిషానికి మౌస్ కదపాలనే రూల్ పెట్టాయి. గంటకోసారి బాస్‌తో మేం పని చేస్తున్నామని చెప్పాలి. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై బాస్‌లు ఉద్యోగులపై నిఘా పెడితే జరిమానా చెల్లించాల్సిందే. అలాగే, చిన్న పిల్లలు కలిగిన సిబ్బందికి తప్పకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. కరోనా వైరస్ వల్ల ‘చైల్డ్ కేర్ సెంటర్’లు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులు తమ పిల్లలను ఎక్కడ ఉంచాలో తెలియక ఆందోళనకు గురవ్వుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ వయస్సు గల పిల్లల తల్లిదండ్రులకు ఈ రూల్ వర్తించదని స్పష్టం చేసింది. మరి, ఇలాంటి చట్టాలను మన దేశంలో ప్రవేశపెట్టగలరా? ఇప్పటికే అమల్లో ఉన్న కార్మిక చట్టాలను ఏ సంస్థ పాటించడం లేదని మనకు తెలిసిందే. మన ప్రభుత్వాలకు కూడా విషయం తెలిసినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు?


Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి