PM Narendra Modi Fitness Routine : వయసు పెరిగే కొద్ది హెల్తీగా ఉండాలంటే ప్రోపర్ డైట్‌తో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. అప్పుడే 70ల్లో కూడా హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు. అలా తన జీవనశైలితో ఇన్స్పైర్ చేస్తున్నవారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. 74 ఏళ్ల వయసులో కూడా హెల్తీగా, ఫిట్‌గా ఉండడానికి ఆయన ఫాలో అయ్యే లైఫ్‌స్టైల్‌నే కారణం. పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు మోదీ. మరి ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతారో.. లైఫ్స్టైల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూసేద్దాం.
మోదీ యోగాను చాలా ప్రమోట్ చేస్తారు. అలాగే తన ఫిట్నెస్ రోటీన్లో కూడా యోగా ఉంటుంది. ప్రతిరోజూ 40 నిమిషాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగ నిద్ర చేస్తారట మోదీ. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చేసే పనులపై ఫోకస్‌గా ఉంటారు. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు యోగా నిద్ర చేస్తారు. అలాగే మోదీ ఎక్కువ నడవడానికి ప్రిఫర్ చేస్తారు. గడ్డిపై చెప్పులు లేకుండా కూడా నడుస్తారట. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేద మెడిసిన్స్ ఉపయోగిస్తారు.
టైమ్ పడుతోంది..
మార్పు అనేది ఒక్కరోజులో జరిగిపోదు. కచ్చితంగా దానికి టైమ్ కావాలి. అలా అని 30, 40ల్లో ఫాలో అయ్యి ఏమి లాభమనుకోకూడదు. హెల్తీగా ఉండాలనే ఆలోచన ఎప్పుడూ వచ్చినా దానిని ఆచరణలో పెడితే కచ్చితంగా హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు. అంతేకాకుండా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని విస్మరించకూడదనే విషయం ప్రధాని మోదీని చూసి తెలుసుకోవాలి. తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంతకీ ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటారంటే..
మునగాకుతో..
మునగాకు ఆరోగ్యానికి ఎంతమంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దీనిని ప్రధాని తన డైట్లో ఉండేలా చూసుకుంటారు. సాధారణంగా మునగాకును ఎలా అయినా తీసుకోవచ్చు.. మోదీ పరాఠాల రూపంలో తీసుకుంటారు. కనీసం వారంలో రెండుసార్లు దీనిని తీసుకుంటారట. దీనిద్వారా ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. బీటా కెరోటిన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం కూడా అందుతాయి. కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బీపీ, షుగర్ కూడా కంట్రోల్ అవుతాయి.
కిచిడీ..
కిచిడీ మంచి రుచితో పాటు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. మోదీకి కూడా ఈ డిష్ అంటే అమితమైన ఇష్టం. ఎన్నో ఇంటర్వ్యూలలో ఆయన కిచిడి ఇష్టమంటూ తెలిపారు. అందుకే ఆయన మెనూలో ఇది కూడా ఉంటుంది.
నచ్చినదే..
వీటితోపాటు సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, మిల్లెట్స్ మోదీ డైట్లో ఉంటాయట. స్పైస్లేని.. తేలికగా జీర్ణమయ్యే బ్యాలెన్స్డ్ ఫుడ్స్‌నే మోదీ ఎక్కువగా తీసుకుంటారట. సమతుల్యమైన ఆహారం ఎప్పుడూ మిమ్మల్ని ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. నచ్చిన ఫుడ్‌ని మెచ్చిన కొలతల్లో తీసుకుని.. హెల్తీగా, ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు మోదీ. కాబట్టి ఈ ఫుడ్‌నే తీసుకోవాలని రూల్ లేదు. మీకు నచ్చిన ఫుడ్‌ని హెల్తీగా ఎలా తీసుకోవాలో తెలుసుకుంటే మంచిది. మరి మీ 70ల్లో మోదీలా ఉండాలంటే.. కాస్త త్వరగా మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి.
Also Read : 60 ఏళ్లు దాటినా జగపతి బాబు ఇంత ఫిట్‌గా ఉండడానికి రీజన్స్ ఇవే.. బెండకాయ జ్యూస్లట, కాకరకాయ రసాలట