Kailash Mansarovar Yatra Full Details : కైలాస మానస సరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన, పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ యాత్ర హిందూ, బౌద్ధ, జైన, బోన్ మతాల వారికి చాలా ప్రత్యేకమైనది. టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరాన్ని చేరుకోవడం అనేది ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ యాత్ర చేయాలంటే.. శారీరకంగా, మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కైలాస మానస సరోవర యాత్రను ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తల తీసుకోవడం అవసరం.

Continues below advertisement

ఆరోగ్య సమస్యలు

కైలాస మానస సరోవర యాత్ర కేవలం మతపరమైన ప్రయాణమే కాదు. ఇది సన్నద్ధతకు, ఓర్పునకు ఒక పరీక్ష కూడా. ఈ యాత్రలో యాత్రికులు 5,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న భూభాగాల గుండా ప్రయాణించాలి. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల, చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పులు, ఎత్తుకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ మార్గం అత్యంత కష్టతరమైనది.

వాతావరణం అనూహ్యంగా మారుతుంది. బలమైన గాలులు, మంచు కురవడం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గుదల కనిపిస్తుంది. అందుకే కైలాస యాత్రకు బయలుదేరే ముందు.. పూర్తి శరీర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా గుండె, రక్తపోటు, మధుమేహం లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించకుండా ఈ యాత్ర చేయకూడదు. 

Continues below advertisement

యాత్రకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీ ప్రయాణానికి ముందు ప్రతిరోజూ నడవడం, తేలికపాటి జాగింగ్ చేయడం, వ్యాయామం చేయాలి. ఇవి మీ శరీర శక్తిని పెంచుకోవడానికి సహాయపడతాయి. నిపుణులు మీ ప్రయాణానికి కొన్ని నెలల ముందు నుంచే మీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని సిఫార్సు చేస్తున్నారు.

ఎప్పుడు వెళ్తే మంచిది?

కైలాస మానస సరోవరాన్ని సందర్శించడానికి మే, జూన్ నెలల మధ్య వెళ్తే మంచిది. ఈ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. జూలై, సెప్టెంబర్ మధ్య ఉండే వర్షాకాలం మార్గాలను కష్టతరం చేస్తుంది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు భారీ హిమపాతం ఉంటుంది. చల్లని వాతావరణం ఈ యాత్రను మరింత సవాలుగా మారుస్తుంది. అయితే మానస సరోవరం యాత్రకు అనుకూలంగా ఉందా లేదా అనేది ప్రభుత్వం చెప్తుంది. అప్పుడు మాత్రమే అనుమతులు ఉంటాయి. 

ఈ డాక్యుమెంట్స్ ఉండాలి..

అదనంగా కైలాస మానసరోవర్ యాత్రకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా, ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ మార్గం టిబెట్ గుండా వెళుతుంది కాబట్టి.. యాత్రికులకు చైనా గ్రూప్ వీసా, టిబెట్ ప్రయాణ అనుమతి అవసరం. ప్రయాణ దరఖాస్తు ప్రక్రియకు సమయం పడుతుంది. కాబట్టి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం ముఖ్యం. అక్కడికి వెళ్లేందుకు చాలామంది ఏజెన్సీలు లేదా ప్రభుత్వ ప్రయాణ కార్యక్రమాల ద్వారా తమ ప్రయాణాన్ని బుక్ చేసుకుంటారు.

లగేజ్ ప్యాకింగ్..

కైలాస యాత్ర సమయంలో వాతావరణం ఎప్పుడైనా మారవచ్చు. అందువల్ల, తెలివిగా సామాను సర్దుకోవడం ముఖ్యం. స్వెటర్స్, థర్మల్స్, వాటర్‌ప్రూఫ్ జాకెట్లు, స్ట్రాంగ్ ట్రెకింగ్ బూట్లు వెంట తీసుకువెళ్లాలి. ఎత్తైన ప్రదేశాలలో ఎండ, చల్లని గాలులు రెండింటికీ ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్, టోపీ, గ్లౌస్ తీసుకెళ్లాలి. అలాగే మెడికల్ కిట్ కూడా ప్యాక్ చేసుకోండి. దీనిలో డీహైడ్రేషన్, జ్వరం, బాడీ పెయిన్స్, సాధారణ గాయాల కోసం మందులు ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రాంతాల్లో సౌకర్యాలు తక్కువ ఉంటాయి కాబట్టి.. ఎనర్జీ బార్‌లు, డ్రై ఫ్రూట్స్, నీటిని శుద్ధి చేసే మెడిసన్స్ ప్యాక్ చేసుకోవడం మంచిది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం దీనిని క్లిక్ చేయండి.