Prashanth Neel on Dragon Story NTR: ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే.. Dark,Gritty అనే ఒక అంచనా ప్రేక్షకులకు ఉంది.అయితే మంగళవారం అర్థరాత్రి విడుదలైన Drogon టీజర్ అంచనాలకు మించి వయలెంట్‌గా ఉంది. NTRను అత్యంత క్రూరమైన Assasinగా చూపించారు. అయితే మీరు ఊహించినదానికన్నా ఈ సినిమా బ్రూటల్‌గా ఉంటుందని మూవీ డైరక్టర్ ప్రశాంత్‌నీల్ Prashant Neel చెప్పాడు. సినిమా విశేషాలను Galata plusతో పంచుకున్నారు. హిరో ఎలివేషన్స్‌ కన్నా.. సినిమా స్టోరీ జనాలకు పరిచయం చేయాలనుకున్నామని.. అందుకే కథే ప్రధానంగా టీజర్ నడిపించామన్నారు.  సినిమా నల్లమందు Opium వ్యాపారం బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందని...బ్రిటిష్ టైమ్‌లో మొదలైన వ్యాపారం స్వాతంత్ర్యం వచ్చాక జరిగిందని...1967 కాలంనాటి పరిస్థితులను   Dystopian Styleలో చూపించామని చెప్పారు. 

నా కెరక్టర్లలో అత్యంత Dark  డ్రాగన్.. NTR క్రూరమైన ఖరీదైన విలన్‌

ఇప్పటి వరకూ తాను సృష్టించిన Grey పాత్రలు రాకీ (KGF) దేవా (Salar) కంటే లూగర్ ( Dragon) అత్యంత డార్క్ పాత్ర అని చెప్పారు. ఈ మూడు కేరక్టర్లు తాను అనుకున్న Triology కేరక్టర్లు అని చెప్పిన ప్రశాంత్.. మూడూ ఒకదానికికొకటి సంబంధం లేనివన్నారు. సలార్ ట్రైలర్ రిలీజ్ అయిన టైమ్.. రాకీభాయ్ సముద్రంలో చనిపోయిన టైమ్ ఒకటే అంటూ ఆడియన్స్ థియరీలు తీశారన్నారు. అయితే ఈ మూడింటిలో ఇదే అత్యంత డార్కెస్ట్ కేరక్టర్ అని ప్రశాంత్ చెప్పారు.. ఇంతవరకూ ఇండియన్ సినిమా చూడనటువుటి ఖరీదైన విలన్‌ను చూస్తారని నవ్వుతూ చెప్పారు. 

NTRకు లూగర్ అని ఎందుకు పేరు పెట్టామంటే..NTR ఈ సినిమాలో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో చీఫ్‌ అసాసిన్ కేరక్టర్‌లో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో చూపించిన కొద్దినిమిషాల్లోనే NTR  లుక్... కైరక్టరైజేషేషన్ చూస్తేనే... ఈ సినిమాలో NTR కేరక్టర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. అయితే NTRకు Luger పేరు అనేది LUGER P 08 పిస్టల్‌ ను ఇన్సిపిరేషన్‌గా పెట్టామన్నారు. ఆ పేరు ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే తెలిసిపోతుందని ప్రశాంత్ నీల్ తెలిపారు.

డ్రాగన్ కథ ఐదేళ్ల క్రితమే అనుకున్నామని..అది ఫైనలైజ్‌  అవ్వడానికి మూడేళ్లు పట్టిందని నీల్ చెప్పారు. ప్రతీ కేరక్టర్ తన Own Phylosophical అప్రోచ్‌తో వెళుతుందన్నారు. Anil Kapoor కారెక్టర్‌  సినిమా పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో బిగ్గెస్ట్‌ విలన్‌ రోల్‌  అని.. ఎందుకంటే తన సినిమాలో విలన్లే హీరోలు కాబట్టి.. వాళ్లకి వ్యతిరేకంగా ఉండేవాళ్లు విలన్లు అని ప్రశాంత్ తన స్టైల్ నేరేటివ్ చెప్పాడు