అడుగులు వేస్తుంటే అందమైన సంగీతం వినిపిస్తుంటే ఎంత బావుంటుందో కదా. అందుకే ఎలివేటర్ ఉన్నా కూడా వాడడం మానేసి అందరూ మెట్లు వాడడం మొదలుపెట్టారు. ఓపక్క ఎస్కలేటర్, వాటి ఆనుకునే మెట్లు. మొదట్లో అందరూ ఎలివేటర్ కోసమే పరుగులెత్తేవారు. కానీ ఇప్పుడు మెట్లకు సంగీతం జోడవ్వడంతో ఇప్పుడంతా మెట్లు మీద నడిచేందుకు ఇష్టం చూపిస్తున్నారు. ‘పియానో స్టెయిర్‌కేస్’ ఎక్కడున్నాయో తెలుసా? స్వీటన్లోని స్టాక్‌హోమ్ నగరంలోని ఓ సబ్ వేలో.


వోక్స్ వ్యాగన్ సంస్థ, యాడ్ ఏజెన్సీ అయిన DD స్టాక్ హోమ్ కలిపి ప్రయోగాత్మకంగా దీన్ని రూపొందించారు. ప్రయాణికుల ఆలోచనను మార్చడానికి వారిలా కొత్తగా రూపకల్పన చేసినట్టు చెబుతున్నారు.మెట్లు ఎక్కడం దిగడం అనేది ఆరోగ్యానికి సహకరించే అంశం. అందుకే ప్రజల్లో ఆ విషయంలో అవగాహన పెంచేందుకే ఇలాంటి ప్రాజెక్టును మొదలుపెట్టారు. పియానో మెట్లు వాడుకలోకి వచ్చాక 66 శాతం మంది ఎస్కలేటర్ వాడడమే మానేశారు. 


సంగీతం మెట్లు వచ్చాక చాలా మటుకు ఎస్కలేటర్ ఖాళీగా తిరుగుతున్నట్టు గుర్తించారు అధికారులు. ఎస్కలేటర్ మానేసి మెట్లపై నుంచి  తిరగడం వల్ల ఆరోగ్యం, పైగా ఎస్కలేటర్ అధికంగా వాడకపోవడం వల్ల కరెంటు కూడా ఆదా అవుతుంది. 






చైనాలోనూ పియానో మెట్లను గతంలో ఏర్పాటు చేశారు.గ్వాంజోలోని మెట్రో స్టేషన్లో ఈ అందమైన పియానో మెట్లు ఉన్నాయి. 



Also read: అమ్మను పెళ్లి దుస్తుల్లో అలా చూసి, నిజమైన ఆనందం అంటే ఇది, వీడియో చూడాల్సిందే


Also read: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది