PCOD Health : పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్(PCOD). హార్మోన్ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ సమస్య వస్తుంది. ఈ PCODతో చాలామంది మహిళలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనివల్ల పీరియడ్స్​లో మార్పులు, పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం, అండాశ సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ కూడా కష్టమవుతుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకునేందుకు లైఫ్​ స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు నిపుణులు. అవేంటో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

వ్యాయామం

రెగ్యులర్​గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయాలి. వీటివల్ల మెటబాలీజం పెరిగి హార్మోన్లు అదుపులో ఉంటాయి. మీకు జిమ్​కి వెళ్లడం, వ్యాయామం చేయడం ఇబ్బంది ఉంటే మీరు రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల వాకింగ్ అయినా  చేస్తే మంచిది. యోగా, సైక్లింగ్ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. 

ఒత్తిడి 

ఒత్తిడి వల్ల కూడా హార్మోనల్ సమస్యలు పెరుగుతాయి. వీటివల్ల PCOD సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, జర్నలింగ్ వంటివి చేయడం వల్ల ఒత్తిడి అదుపులోకి వస్తుంది. శరీరంలో కార్టిసోల్ లెవెల్స్​ను తగ్గించి హార్మోన్ సమస్యలను బ్యాలెన్స్ చేస్తుంది. 

ఫుడ్స్ 

యాంటీ ఇన్​ఫ్లమేటరీ పుష్కలంగా ఉండే ఫుడ్స్ రెగ్యులర్​ డైట్​లో చేర్చుకోవాలి. పసుపు, అల్లం, ఆకుకూరలు డైట్​లో ఉండేలా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి శరీరంలో PCOD వల్ల వచ్చే ఇన్​ఫ్లమేషన్ సమస్యను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. 

నిద్ర 

నిద్ర సమస్యలు కూడా PCOD సమస్యని పెంచుతాయి. కాబట్టి కనీసం 7 నుంచి 9 గంట నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర నాణ్యత మెరుగైతే.. హార్మోనల్ సమస్యలు అదుపులో ఉంటాయి. 

డైట్

PCOD ఉంటే బరువు తగ్గాలి. అయితే దానిని డైట్స్​తో తగ్గాలి అనుకుంటే మంచిది కాదు. అలా చేయడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. క్రాష్ డైట్ లేదా తినడం పూర్తిగా మానేయడం చేయకూడదు. ఇవి మెటబాలీజాన్ని, ఒత్తిడిని ట్రిగర్ చేస్తాయి. దీనివల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవడంపై ఫోకస్ చేయండి. ఆహారం తీసుకోవడం మానేయడం కాదు.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే శరీరానికి మంచిదో వాటిని తీసుకోవాలి. 

డీటాక్స్ డ్రింక్స్ 

శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేసే డ్రింక్స్ తీసుకుంటే మంచిది. ఇవి శరీరాన్ని సున్నితంగా, సహజంగా క్లెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపి.. PCOD సమస్యను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. 

తినకూడని ఫుడ్స్

షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, కార్బ్స్​కి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే కార్బ్స్, షుగర్స్ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెంచుతాయి. అలాగే హార్మోనల్ సమస్యలు పెంచుతాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారు. 

ఒమేగా 3 

డైట్​లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ చేర్చుకోవాలి. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. PCOD సమస్యను తగ్గిస్తాయి. కాబట్టి అవిసెగింజలు, సన్​ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, వాల్​నట్స్ హార్మోన్లను రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి ఋతుక్రమ సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. 

హైడ్రేషన్ 

హార్మోనల్ సమస్యలు, PCODని దూరం చేసుకోవడానికి మీరు హైడ్రేటేడ్​గా ఉండాలి. నీటిని శరీరానికి అందించడం వల్ల టాక్సిన్లు బయటకి వెళ్లిపోతాయి. లివర్ ఫంక్షన్ మెరుగవుతుంది. జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.