సోషల్ మీడియా పుణ్యమాని ఏ మూల జరిగిన ఉదంతం అయిన దానికి సంబంధించిన వీడియో నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఆ వీడియోలో ఆసక్తికరమైన కంటెంట్ ఉంటే చాలు. అది వైరల్ అవ్వడాన్ని ఆపడం ఎవరితరం కాదు. అలాంటి ఒక వీడియో ఇది కూడా. అమెరికాలోని చిలీలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో వైరల్ అవుతూ మనదాకా చేరింది. అసలేమైందో చూడండి.
ఒక రిపోర్టర్ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకుని, చేతిలో మైక్‌తో లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఓ చిలుక అతని భుజంపై వాలింది. అతను దాన్ని ఏమీ అనకుండా తన పని తాను చేసుకున్నాడు. ఈ లోపు ఆ చిలుక మెల్లగా అతని చెవిలో ఉన్న చిన్న ఇయర్ బడ్‌ని పట్టుకుని ఎగిరిపోయింది. దీంతో రిపోర్టర్ షాక్ తిన్నాడు కానీ ప్రత్యక్ష ప్రసారంలో ఉండడంతో ఇబ్బంది పడుతూనే తన పని తాను పూర్తి చేశాడు. ఇదంతా లైవ్‌లో ప్రసారం అయ్యింది. తరువాత కెమెరామేన్ వెళ్లి ఇయర్ బడ్ తెచ్చుకోమని చెప్పడంతో రిపోర్టర్ ఆ పని చేశాడు. చిలుక ఆ ఇయర్ బడ్‌ను ఎత్తుకెళ్లి కొంత దూరంలో పడేసింది. చిలుక అదేదో ఆహారం అనుకుని పట్టుకెళ్లిందనుకుంటున్నారు అంతా.
ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. రష్యాలో ఒక రిపోర్టర్ వాతావరణం గురించి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతుంటే ఒక కుక్క ఆమె మైక్రోఫోన్‌ను నోటితో పట్టుకుని పారిపోయింది. ఆ మైక్రోఫోన్ రిపోర్టర్ చేతిలో ఉంది. అయినా గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క ఎగిరి మరీ దాన్ని లాక్కుని పారిపోయింది. దీంతో లైవ్ ఫీడ్ కట్ అయిపోయింది. దీంతో ఆ రిపోర్టర్ గాలులు వీస్తున్నప్పటికీ ఆ కుక్క వెంట పరిగెత్తింది. ఆ వీడియో కూడా చాలా వైరల్ గా మారింది. చివరికి ఆ కుక్క మైక్రోఫోన్‌ను వదిలేసింది. ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఆ వీడియోను మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ ఛానెల్ వారు మైక్రోఫోన్ తిరిగి ఇచ్చేసిన కుక్కను చాలా దయగల కుక్కగా అభివర్ణించారు.