Just One Inch..కేవలం ఒక అంగుళం.ఒక బలమైన మనిషిని గాలిలోకి ఎగరగొట్టడానికి Kung Fu లెజెండ్ బ్రూస్ లీ పంచ్‌కి సరిగ్గా ఇంతే దూరం కావాలి. ఇక్కడ ఎలాంటి హంగూ లేదు. హడావుడి లేదు, ఆర్భాటం లేదు— ఎంతో తక్కువ దూరం నుంచి అమితమైన శక్తిని సృష్టించడమే..ఈ 'వన్-ఇంచ్ పంచ్' ఇది కేవలం మార్షల్ ఆర్ట్స్ ట్రిక్ మాత్రమే కాదు; అది మానవ సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచే ఒక Powerful Statement. వేగం, సరైన పద్ధతి (టెక్నిక్) అంతర్గత శక్తి ఉంటే, అపారమైన బలాన్ని కూడా సులభంగా అధిగమించవచ్చని ఆయన నిరూపించారు. ఈ అద్భుతమైన పంచ్.. ఆ అమోఘమైన శక్తి.. ఆ అపరిమితమైన వేగమే..బ్రూస్ లీని ఆధునిక మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో మహాయోధుడిని చేశాయి. తన మరణం తర్వాత దశాబ్దాలు గడిచినా ఎందుకు తిరుగులేని వ్యక్తిగా మిగిలాడో చెప్పడానికి ఆ వన్ ఇంచ్ పంచ్ కీలకం.
అసలు ఏంటి ఈ వన్ ఇంచ్ పంచ్..!
1960లలో బ్రూస్ లీ ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు, వాలంటీర్ ఛాతీకి తన చేతిని ఒక అంగుళం దూరంలో ఉంచేవాడు... చేతిని పూర్తిగా కూడా చాపేవారు కాదు. కానీ అద్భుతమైన శరీర కదలికలతో మెరుపువేగంతో ఓ పంచ్ ఇచ్చేవాడు..అంతే భూకంపం లాంటి శక్తి పుట్టేది.ఎదుట ఉన్నది ఎంత పెద్ద బలవంతుడైనా సరే..కుప్పకూలిపోయేవాడు. తన కదలిక, కిక్ ద్వారా బ్రూస్‌లీ.. అందరినీ దిగ్భ్రమకు గురిచేసేవాడు. బ్రూస్‌లీ తన కదలిక ద్వారా మెస్మరైజ్ చేసేవాడు కానీ.. అదేమీ కనికట్టు కాదు. పూర్తిగా శాస్త్రీయమైంది.
Science behind One Inch Punch:
- శరీర మెకానిక్స్ ఇందులో ముఖ్యమైంది. బ్రూస్‌లీకి శక్తి మోచేతిలో కాదు. అతను శరీరం కోర్ నుంచి శక్తిని సృష్టించేవాడు. శక్తిని కాళ్ళ నుండీ భూమి నుండీ తీసుకుని, తుంటి, మెడ ద్వారా సరైన మార్గంలో మళ్లించి, పిడికిలి ద్వారా సెకనులో కొద్ది భాగంలో రిలీజ్ చేయడం ఈ పద్ధతి.
- ఈ పంచ్ చాలా తక్కువ దూరం నుంచి ఇవ్వాల్సి ఉన్నందున బ్రూస్‌లీ అపరిమితమైన స్పీడ్, యాక్సలరేషన్ మీద ఫోకస్ చేసేవాడు.. సెకను కంటే చాలా తక్కువ సమయంలోనే మాగ్జిమం ఎనర్జీని మళ్లించేవాడు.
- మణికట్టు, మోచేయి, భుజాలు పర్‌ఫెక్ట్‌గా అనుసంధానం చేసేవాడు. శరీరంలో సృష్టించిన బలం మొత్తం.. ఏ కొంచం కూడా వృధా కాకుండా నేరుగా టార్గెట్‌ను తాకేలా ఫోకస్ చేసేవాడు
ఇది బేసిక్ కుంగ్‌ఫూ నే అయినప్పటికీ బ్రూస్‌లీ తాను సొంతంగా రూపొందించిన Jeet Kune Do లో ఓ భాగం. తక్కువ మూవమెంట్‌తో ఎక్కువ ప్రభావం చూపించడం అన్నది దీని ప్రధానోద్దేశ్యం. ఈ టెక్నిక్‌తో "మనిషి శరీరం యొక్క పరిమితులను తిరిగి రాయవచ్చు" అని Bruce Lee నిరూపించారు. బ్రూస్ లీ తన మొత్తం ఫిలాసఫీని ఈ ఆలోచనపైనే నిర్మించాడు.
బ్రూస్ లీ: కేవలం ఫైటర్ కాదు, ఒక విప్లవకారుడు
నిజానికి, బ్రూస్ లీ కేవలం బలవంతుడో లేకపోతే.. అత్యంత వేగంగా కదిలే యోధుడో మాత్రమే కాదు. అతను గొప్ప ఆలోచనాపరుడు, కదలికలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త, సంస్కృతిని మార్చిన విప్లవకారుడు. అతని కంటే ముందు, మార్షల్ ఆర్ట్స్ చాలా కఠినమైన నియమాలతో ఉండేవి. ఆయన వాటిని బద్దలు కొట్టి "జీత్ కున్ దో" (Jeet Kune Do - పిడికిలిని అడ్డగించే మార్గం)ను సృష్టించారు. “ఉపయోగపడేదాన్ని స్వీకరించు, పనికిరానదాన్ని విస్మరించు, నీదంటూ ప్రత్యేకమైనదాన్ని జోడించు” అనే సూత్రంపై ఆధారపడిన ఈ పద్ధతి ప్రపంచ మార్షల్ ఆర్ట్స్‌ను శాశ్వతంగా మార్చింది. అంతేకాక, 1960ల నాటి జాతి వివక్ష ఉన్నహాలీవుడ్‌లో, బ్రూస్ లీ అన్ని అడ్డంకులను దాటి గ్లోబల్ ఐకాన్ అయ్యారు. ఆసియా హీరోలను శక్తిమంతంగా, అందంగా, అందరికీ చేరువగా" ఉండేలా తెరపై నిలబెట్టి, ఆసియా సంస్కృతిని పశ్చిమ దేశాలకు పరిచయం చేశారు. ఆయన ఫిట్‌నెస్ విధానాలు కూడా ఈనాటి MMA, హై-ఇంటెన్సిటీ, యుద్ధ విద్యలు వంటి శిక్షణలను ప్రభావితం చేశాయి.
బ్రూస్‌లీ మరణం- రహస్యాలు
32 ఏళ్ల చిన్న వయసులోనే 1973 జూలై 20న బ్రూస్‌లీ అకాల మరణం చెందాడు. అధికారికంగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువుగా వాడటం వల్ల వచ్చిన 'సెరిబ్రల్ ఎడెమా' (మెదడు వాపు) అని ప్రకటించినప్పటికీ, చైనీస్ ప్రత్యర్థి గ్యాంగ్‌ల కుట్ర, హాలీవుడ్ పన్నాగం, కుటుంబ శాపం, మార్షల్ ఆర్ట్స్ కోసం విపరీతమైన ఫిజికల్ స్ట్రైయిన్ తీసుకోవడం వంటి సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత సమస్య అని కూడా కొత్త విషయాన్ని లేవదీశారు. కానీ అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఏవీ నిరూపితం కాలేదు. బ్రూస్‌లీ అతి చిన్న వయసులో చనిపోవడం, ఆయనకున్న విపరీతమైన ఫేమ్, తన మార్మిక స్వభావం వీటి వలన బ్రూస్‌లీ మరణం చుట్టూ అనేక myths అలాగే మిగిలిపోయాయి.
Bruce Lee ఫిలాసఫీ:
అంత చిన్న వయసుకే బ్రూస్‌లీ లా ప్రభావితం చేసిన వారు మరొకరు లేరనిపిస్తుంది. మైఖేల్ జాక్సన్ వంటి వాళ్లు కళ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ అయ్యారు కానీ.. బ్రూస్‌లీ కేవలం తన రంగంలోనే కాదు.. తన స్టేట్‌మెంట్‌లు, ఫిలాసఫీ ఆధారంగా కూడా ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాృడు. Be water, my friend.. అంటూ కనిపించే బ్రూస్ లీ వీడియోలు చాలా మందిల స్ఫూర్తి నింపుతాయి. ఒక అథ్లెట్‌గా కనిపించిన గొప్ప తత్వవేత్త తను..! నీరు లాగా మార్పుకు సిద్ధంగా ఉండటం (Adaptability), ఏ ఆకారాన్నైనా తీసుకోవడం, అడ్డంకులను ఛేదించుకుని పోగలగడం—ఇదే ఆయన మార్షల్ ఆర్ట్స్ శైలికి ఆధారం. డోంట్ ఇమిటేట్, డోంట్ కాపీ అన్నది కూడా బ్రూస్‌లీ ప్రధానమైన నినాదం. నిజాయతీగా మన Expression ఉండాలని భావిస్తారు. వన్-ఇంచ్ పంచ్ చూపించినట్లుగా, హడావుడి కంటే సామర్థ్యం (Efficiency) ముఖ్యమని ఆయన నమ్మారు.
బ్రూస్‌లీ అకాల మరణం చెందకపోయి ఉంటే..?
ఆయన త్వరగా చనిపోవడం అనేది ప్రపంచానికి ఒక పెద్ద లోటు. బ్రూస్ లీ జీవించి ఉంటే, హాలీవుడ్ చాలా వేగంగా రూపు మార్చుకునేది. ఆసియన్లు ప్రధాన పాత్రలు పోషించే పెద్ద సినిమాలు దశాబ్దాల ముందే వచ్చి ఉండేవి. చాలా మంది ఆయన్ని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) గాడ్‌ఫాదర్‌గా భావిస్తారు కాబట్టి, UFC తరహా పోరాట క్రీడలు కూడా చాలా త్వరగా పరిచయమై ఉండేవి. అంతేకాక, ఆయన అసంపూర్తిగా వదిలేసిన పుస్తకాలు శిక్షణా మాన్యువల్స్ ద్వారా, ఆయన సిద్ధాంతం ప్రపంచ ఫిట్‌నెస్‌ను నడిపించేది. ఆయనకున్న ఆకర్షణ, తెలివితేటలు, మరియు ప్రభావంతో ఓ నెల్సన్ మండేలా లేదా మహమ్మద్ అలీ స్థాయిలో సాంస్కృతిక ఐక్యత కోసం మాట్లాడే గళంగా కూడా ఆయన ఎదిగి ఉండేవారు. ఆయన అకాల మరణం ఆయన్ని లెజెండ్‌గా స్థిరపరిచినా, ప్రపంచం కోల్పోయిన ఆవిష్కరణలు మాత్రం ఎన్నో!
BruceLee is Eternal
వన్ ఇంచ్ పంచ్ అనే బ్రూస్‌లీ టాలెంట్ కాదు.. ఆ వన్ఇంచ్ పంచ్‌తో ఆయన ఇచ్చిన Statement ద్వారా ఈ మార్షల్ ఆర్ట్స్ యోధుడు Eternal గా నిలిచాడు. బలం కంటే వేగం, కండరం కంటే మేధస్సు, శక్తి కంటే పద్ధతి, కఠినత్వం కంటే స్వేచ్ఛ అనే విషయాలతో బ్రూస్ లీ ఒక విశ్వాన్నే ఆ ఒక్క అంగుళంలో నింపేశారు. ఆ ఒక అంగుళం ద్వారా, ఆయన ప్రపంచంలోని ఫైటర్లను, కళాకారులను, ఆలోచనాపరులను, కలలు కనేవారిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉన్నారు. Legends are Forever.
(నవంబర్ 27, బ్రూస్ లీ జయంతి..)