Bollywood Actress Hema Malini Emotional Post About Her Husband Death : బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, హీ మ్యాన్ ధర్మేంద్ర 3 రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనే తన సర్వస్వం అని ధర్మేంద్ర మరణం తనకు తీరని లోటని భార్య, ప్రముఖ నటి హేమా మాలిని ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన భర్తతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ గత జ్ఞాపకాలను పంచుకున్నారు.
నా లైఫ్‌లో అన్నీ ఆయనే...
తన లైఫ్‌లో అన్నీ ధర్మేంద్రనే అని హేమా మాలిని ఎమోషనల్ అయ్యారు. 'ధరమ్ జీ... భార్యను అమితంగా ప్రేమించే భర్త. మా ఇద్దరు అమ్మాయిలు ఈషా, అహానాకు ఆరాధ్యుడైన తండ్రి. మంచి స్నేహితుడు. మార్గదర్శకుడు, గైడ్, ఫిలాసఫర్, కవి. ఇలా అవసరమైన అన్నీ సమయాల్లో నాకు తోడుగా ఉన్నాడు. కుటుంబమే సర్వస్వంగా బతికాడు. ఓ సెలబ్రిటీగా టాలెంట్, మానవత్వం వంటి వాటితో దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఆయన కీర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది. నాకు వ్యక్తిగతంగా ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆ బాధ వర్ణించలేను. ఆయనతో కలిసి జీవించిన క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నాకు ఎప్పటికీ లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఇచ్చారు.' అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
Also Read : మంచు ఫ్యామిలీలో కాంట్రవర్సీ - మంచు లక్ష్మి రియాక్షన్
ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ దేవోల్. 1935, డిసెంబర్ 8న జన్మించిన ఆయన... 1954లో ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్. ఇద్దరూ తండ్రి వారసత్వంగా హిందీలో మంచి నటులుగా పేరు సంపాదించుకున్నారు. ధర్మేంద్రకు హేమా మాలిని రెండో భార్య. వీళ్లకు ఈషా డియోల్, అహానీ డియోల్ ఇద్దరు కుమార్తెలు.