Lakshmi Manchu Reaction About Her Family Issue : గత కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్... మోహన్ బాబు, విష్ణు మంచు మధ్య కాంట్రవర్శీ అటు సోషల్ మీడియా వేదికగా ఇటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. పలు ఇంటర్వ్యూల్లో దీనిపై బహిరంగంగానే విష్ణు రియాక్ట్ అయ్యారు. తాజాగా ఈ అంశంపై మంచు లక్ష్మి స్పందించారు. ఈ విషయంలో తనపై ట్రోల్స్ కూడా చేశారంటూ ఓ పాడ్ కాస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడు వరం ఇస్తే...
దేవుడు తనకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మళ్లీ తన ఫ్యామిలీ మొత్తం కలిసిపోవాలని కోరుకుంటానని చెప్పారు మంచు లక్ష్మి. 'గతంలో ఉన్నట్లు అందరూ కలిసి ఉండాలని దేవున్ని అడుగుతాను. అన్నీ కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయి. అయితే, ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు అందరూ ఒక్కటవ్వాలి. ఇండియన్ ఫ్యామిలీల్లో కొన్నిసార్లు ఏదైనా వివాదాలు జరిగితే లైఫ్ లాంగ్ అలానే ఉండాలని అనుకుంటారు. కానీ మనకు చివరకు మిగిలేది రక్త సంబంధీకులు మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఫ్యామిలీతో కలిసి ఉండేందుకు ఎన్ని పోరాటాలైనా చేయాలి. అంతేకానీ దూరాన్ని పెంచకూడదు.' అని అన్నారు.
Also Read : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
ఇష్టం వచ్చినట్లు రాసేశారు
తాను ముంబయిలో ఉంటానని... ఇక్కడి విషయాల గురించి తెలిసినా బాధ పడలేదంటూ కొంతమంది ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసినట్లు మంచు లక్ష్మి తెలిపారు. 'ఆ టైంలో నేను ఎంత మానసిక బాధను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ కాంట్రవర్సీ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి వారికి నచ్చినట్లు ఊహాగానాలు సృష్టించి మరీ రాసేశారు. నేను వాటి గురించి రియాక్ట్ కావాలని అనుకోలేదు.
ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం. ఇలాంటి వివాదాలు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ చూసి నేను షాక్ అయ్యా. నా ఫ్యామిలీ గురించి నేను ఏం అనుకుంటున్నానో ఆ కాంట్రవర్సీ వల్ల ఎంత బాధ పడ్డానో బయట వారికి చెప్పాల్సిన అవసరం లేదని అనుకున్నా.' అని మంచు లక్ష్మి తెలిపారు.