Thamma ott release date and platform details: 'థామా' దీపావళి సందర్భంగా అక్టోబర్ 21, 2025న థియేటర్లలో విడుదలైంది. మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (Maddock Horror Comedy Universe)లోని ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్న జంటగా నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. హిందీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. 'థామా' ఏ ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుందో తెలుసుకుందామా?
'థామా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్న హారర్ కామెడీ 'థామా' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన తేదీ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, దర్శక నిర్మాతలు గానీ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ప్రతినిథులు గానీ ఇప్పటి వరకు 'థామా' OTT విడుదల గురించి అధికారిక ప్రకటన చేయలేదు.
'థామా' బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత?Thamma Box Office Collection: 'థామా' బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి చెప్పాలంటే... బాలీవుడ్ ట్రేడ్ పోర్టల్స్ ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలో 134.7 కోట్ల నెట్ కలెక్షన్ చేసింది. అయితే, గ్రాస్ కలెక్షన్ 161.01 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 187.51 కోట్లు వసూలు చేసింది.
Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విట్టర్ రివ్యూ: నో మోర్ డౌట్... ఒక్కటే రిపోర్ట్... రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
'థామా' కథాంశం ఏమిటి? 'థామా' కథ విషయానికి వస్తే... భారతీయ జానపద కథల ఆధారంగా తీసిన ఒక రక్త పిశాచి కథ ఇది. 'థామా' కథ అంతా ఆయుష్మాన్ ఖురానా పోషించిన అలోక్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతను ఒక జర్నలిస్ట్. రష్మికా మందన్న పోషించిన తారకతో అతను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఆ తర్వాత బెటల్స్ అనే రహస్య సమూహంలో తారక ఓ భాగమని అలోక్ తెలుసుకుంటాడు. దానికి నవాజుద్దీన్ సిద్ధిఖీ నాయకుడు. అలోక్, తారక కలిసి చీకటి శక్తులను ఎలా ఎదుర్కొన్నారు? ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించారు? అనేది కథ.
'థామా' సినిమాలో ఎవరెవరు ఉన్నారు?ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన 'థామా'లో ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇందులో వరుణ్ ధావన్ కూడా భేడియాగా ప్రత్యేక పాత్రలో నటించారు.
Also Read: చిరంజీవి vs విజయ్... బెస్ట్ డ్యాన్సర్ కాంట్రవర్సీపై కీర్తీ సురేష్ రియాక్షన్