మిక్రాన్ కొత్త వేరియంట్ BA.7. చైనాని అల్లకల్లోలం చేస్తుంది. ఆ దేశ పరిస్థితి చూసి ఇతర దేశాలు భయపడిపోతున్నాయి. ఆ భయాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా కొత్త అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, అందులో BA.7 గురించి చెప్పలేదు. BA.5 అనే మరో కొత్త వేరియంట్ గురించి చెప్పారు. అది మెదడుపై దాడి చేసేలా అభివృద్ధి చెందుతుందని పరిశోధకులు తెలిపారు. గతంలో వచ్చిన అధ్యయనాల ఫలితాలని సవాలు చేసే విధంగా ఈ కొత్త అధ్యయనం ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.


ఏమిటీ ఈ అధ్యయనం?


ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మీద జరిపిన కొత్త పరిశోధనలో అది మానవ శరీరంపై ఎలా దాడి చేస్తుందో పరిశీలించారు. శ్వాసకోశ వ్యవస్థకి సోకడం దగ్గర నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ కి చెందిన పరిశోధకులు మునుపటి వైరస్ కంటే BA.5 వేరియంట్ ఎలుకల మెదడు మీద తీవ్రమైన నష్టం కలిగించినట్లు గుర్తించారు. మెదడు వాపు, బరువు తగ్గడం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా రావొచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. BA.1 తో పోలిస్తే BA.5 వేరియంట్ ఎలుకల్లో వేగంగా బరువు తగ్గడం, మెదడు ఇన్ఫెక్షన్, మరణం సంభవించే అవకాశం ఉందని కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు.


అయితే ఈ కొత్త అధ్యయనాన్ని మరొక బృందం కొట్టి పడేసింది. ఇది మానవులకు వర్తించదని అంటున్నారు. అన్ని ఎలుకలు కొత్త వేరియంట్ వల్ల వచ్చిన మెదడు ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయాయని ఆ బృందం తెలిపింది. కానీ ఇది అంటు వ్యాధుల వల్ల కూడా జరిగే అవకాశం ఉందని హాంకాంగ్ విశ్వవిద్యాలయం నిపుణులు చెప్పుకొచ్చారు. మునుపటి సబ్ వేరియంట్ కంటే ప్రస్తుత వేరియంట్ మానవ మెదడు మీద ఎటువంటి ప్రభావం చూపబోదని అంటున్నారు. దీంతో ఏ అధ్యయాన్ని నమ్మాలో తెలియక పరిశోధకలే జుట్టు పీక్కుంటున్నారు. 


జపాన్, యూఎస్ శాస్త్రవేత్తల బృందం తెలిపిన వివరాల ప్రకారం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉండబోతుందని గత నెలలోనే హెచ్చరించారు. అనేక అధ్యయనాలు కూడా BA.5 వేరియంట్ ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కంటే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించాయి. అలాగే కోవిడ్ 19 టీకాతో పాటు రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోగలదని నివేదించాయి. ఈ జాతి 100 కంటే ఎక్కువ దేశాలలో కనుగొనబడింది.


ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వేయించుకున్న వారికి ఒమిక్రాన్ వేరియంట్ BA.5 సోకుతున్నట్టు గుర్తించారు. ఈ వేరియంట్ ను అడ్డుకోవడానికి ఆ టీకాల సామర్థ్యం ఏమాత్రం సరిపోవడం లేదని గతంలోనే ఒక అధ్యయనం చెప్పింది. అమెరికాలో అధికంగా ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వేయించుకున్నవారే అధికం. ఆఖరికి మూడు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా BA.5 సులువుగా సోకుతున్నట్టు గుర్తించారు. అన్ని వేరియంట్ల కన్నా ఈ వేరియంట్ తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. కోవిడ్ పెద్దగా ప్రభావం చూపదని రిలాక్స్ కాకుండా.. తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని చెబుతున్నారు. లేకపోతే.. లంగ్స్‌ మాత్రమే కాకుండా మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మీరు కూడా తప్పకుండా మాస్క్ ధరించడం, ఇతరాత్ర కోవిడ్ నియమాలను తప్పకుండా పాటించి.. జాగ్రత్తగా ఉండండి. 


Also Read: అతిగా తినడం వల్ల పొట్టలో ఇబ్బందిగా ఉందా? ఈ చిట్కాలతో క్షణాల్లో ఉపశమనం