ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుందని, దానివల్ల చర్మం పాడవుతుందని డ్రింక్ అవేర్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ వెల్లడించింది. ఆల్కహాల్ వల్ల ఇంకా సోరియాసిస్, ఎక్జిమా, రొసేసియా వంటి చర్మ సమస్యలతోపాటు ముడతులు కూడా ఏర్పడతాయని హెచ్చరించింది. అయితే, ఈ విషయంలో పెద్దగా ఆందోళన అక్కర్లేదు. ఆల్కహాల్ తక్కువ శాతం లేదా, పూర్తిగాలేని వైన్ ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. 


అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్‌కు చెందిన పరిశోధకులు ఇటీవల డిల్కాహాలైజ్డ్ అంటే ఆల్కహాల్ పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించిన వైన్‌ను తాగితే ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై పరిశోధనలు జరిపింది. ప్రతి రోజు రెండు గ్లాసుల నాన్ ఆల్కహాలిక్ మస్కాడిన్ వైన్ తాగే మహిళలు వారి చర్మంలోని సాగే గుణాన్ని, హైడ్రేటింగ్ కెపాసిటిని మెరుగుపరుచుకోవడం గమనించారని గుర్తించారు.


నాన్ ఆల్కహాలిక్ వైన్‌లో ‘ఫాలిఫెనాల్స్’ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయని, అవి మహిళల చర్మం మీద సానుకూల ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలుసుకున్నారు. ఈ రసాయనం మొక్కల్లో ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇతర రెడ్ వైన్ రకాలతో పోలిస్తే మస్కాడిన్ ద్రాక్ష ప్రత్యేకమైన పాలీఫెనోలిక్ ప్రొఫైల్ కలిగి ఉందని కనుగొన్నట్టు ఫ్లొరిడా విశ్వవిద్యాలయంలో ఫుడ్ కెమిస్ట్రీ ఫంక్షనల్ పుడ్ ప్రొఫెసర్ తెలిపారు. మస్కాడిన్ వైన్ పాలీఫనాల్స్ మధ్య వయస్కులు వృద్ధులలో చర్మం సాగేగుణాన్ని కోల్పోకుండా నిరోధిస్తోంది. ట్రాన్ష్ పిడెర్మల్ వాటర్ లాస్ ను కూడా నిరోధించే సామర్థ్యం కలిగి తెలిపారు.


మస్కాడిన్ ద్రాక్ష ఆగ్నేయ అమెరికాలో పండే పంట. దీనిని వైన్ తయారికి ఉపయోగిస్తారు. వీటిలో ఉండే పాలీఫెనాల్స్ ఇన్ ఫ్లమేషన్ ను, ఆక్సిడేటివ్ ఒత్తిడిని కూడా నివారిస్తుంది. ఆక్సిడేషన్ ఒత్తిడి వల్ల శరీరంలో ప్రీరాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత ఏర్పడి కణజాలాలలకు హాని జరగవచ్చు. ఆక్సిడేషన్ రకరకాల వ్యాధులకు కూడా కారణం కావచ్చు.


వైన్ లో ఉండే బయోయాక్టివ్స్.. ముఖ్యంగా పాలీఫెనాల్స్, చర్మ ఆరోగ్యం మీద ప్రభావం చూపడం ఆసక్తి కలిగించిందని, అందుకే డీఆల్కాహాలైజ్డ్ మస్కాడిన్ వైన్ సూచించామని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనానికి 40 నుంచి 67 సంవత్సరాల మధ్య వయసున్న 17 మంది మహిళలను ఎంపికచేసుకున్నారు. వీరికి 10 ఔన్సులు అంటే సుమారు రెండు గ్లాసుల డీ ఆల్కహాలైజ్డ్ వైన్ ఆరువారాల పాటు ప్రతిరోజూ ఇచ్చారు. తర్వాత మూడు వారాల విరామం తీసుకుని మరో ఆరువారాల పాటు మరోరకమైన డ్రింక్ తీసుకున్నారు.


డీఆల్కహాలైజ్డ్ డ్రింక్ తీసుకున్న మూడు వారాల తర్వాత, ఆరువారాల పాటు మరో రకమైన డ్రింక్ తీసుకున్న తర్వాత ఆ మహిళల చర్మంలో ఆక్సిడేషన్ ప్రెషర్ ను అసెస్ చేశారు. మస్కాడిన్ వైన్ తాగడం వల్ల చర్మంలో సాగే గుణం గణనీయంగా మెరుగ్గా ఉండడాన్ని గమనించారట. చర్మంలో సాగే గుణం తగ్గిపోవడం వల్ల చర్మం మీద వయసు ఛాయలు కనిపిస్తాయి. మస్కాడిన్ వైన్ చర్మం ఉపరితలం డీహైడ్రేట్ కావడాన్ని కూడా  నిరోధించినట్టు ఈ ప్రయోగం నిరూపిస్తోంది.


అయితే ఫ్లెసిబో తాగావారిలో వైన్ తాగే వారి చర్మంలో పెద్ద తేడా లేదని కూడా నిపుణులు అభిప్రాయపడ్డారు. మస్కాడిన్ వైన్ తీసుకున్న ఆరువారాల తర్వాత ముంజేతి చర్మం మీద సాగేగుణం గణనీయంగా మెరుగవడాన్ని గమనించినట్టు ఈ పరిశోధకులు ప్రకటించారు. ఆక్టిడేటివ్ స్ట్రెస్ తగ్గడమే ఇందుకు కారణమట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆల్కహాల్ కలిగిన వైన్ తాగితే ఫలితాలు ఇలా ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. ఇది కేవలం 17 మంది మాత్రమే పాల్గొన్న పరిశోధన. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో పరిశోధనకు వ్యక్తులను ఎంపిక చేసుకుని ప్రయోగాలు నిర్వహించేందుకు ఈ ప్రయోగం సహాయ పడుతుందని ఈ పరిశోధకులు ఆశాభావం వ్యక్తపరిచారు.


Also read : Plantar Fasciitis: పాదాల నొప్పి వేధిస్తోందా? కారణం ఇదే - ఇలా చేస్తే పూర్తిగా ఉపశమనం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial