Real Reasons of Weight Loss Motivation Drops :  కొత్త సంవత్సరం వస్తుందంటే చాలామంది బరువు తగ్గాలని డిసైడ్ అవుతారు. గట్టిగా ట్రై చేసి.. ఫిబ్రవరి వచ్చేసరికి దానిని లైట్ తీసుకోవడం ప్రారంభిస్తారు. అయితే చాలామంది క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది అనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుందట. సంవత్సరాల తరబడి ఒక లైఫ్ స్టైల్​కి అలవాటు పడి.. సడెన్​గా కొత్త రొటీన్​కి అలవాటు పడాలంటే.. శరీరాన్ని, మనస్సుని ఏకం చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అప్పుడే బరువు తగ్గాలన్నా కోరకతో పాటు.. ఫలితాలు మంచిగా ఉంటాయి.

Continues below advertisement

ఆధునిక జీవనశైలి ప్రధానకారణం

క్రమరహిత ఆహారం, ఒత్తిడి, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, ఆలస్యంగా నిద్రపోవడం, నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లు గందరగోళానికి గురవుతాయి. శరీరంలో కార్టిసాల్ పెరగడం వల్ల కోరికలు పెరుగుతాయి. ముఖ్యంగా చక్కెర తినాలనిపిస్తుంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల గ్రెలిన్ పెరుగుతుంది. లెప్టిన్ తగ్గి.. ఆకలిని అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది. దెబ్బతిన్న పేగుల సూక్ష్మజీవులు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఇది స్ట్రెస్ ఈటింగ్, మంటకు దారితీస్తుంది. ఈ హార్మోన్ల మార్పుల వల్ల బరువు తగ్గాలనే కోరిక తగ్గిపోయి ఫుడ్ మీదకి మైండ్ వెళ్లిపోతుంది.

ఫుడ్​లో మార్పులు

సమతుల్యమైన భోజనం తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ తగ్గుతుంది. ప్రోటీన్, ఫైబర్‌తో నిండిన భోజనం కడుపు నిండుగా చేస్తుంది. గ్లూకోజ్ పెరుగుదలను తగ్గిస్తుంది. సాధారణంగా 12 గంటల రాత్రిపూట ఉపవాసం జీవక్రియ సౌలభ్యాన్ని అందిస్తుంది. అయితే ఉదయం సూర్యరశ్మి సర్కాడియన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. దీనివల్ల సాయంత్రం ఆకలిని తగ్గిస్తుంది. రోజుకు 20-25 నిమిషాల వ్యాయామం కూడా GLP-1ని పెంచుతుంది. ఇది సహజంగానే స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.

Continues below advertisement

అలవాట్లలో మార్పులు

మెదడు సౌకర్యం, రొటీన్​ను ఇష్టపడుతుంది. అందుకే ఒకేసారి బరువు తగ్గాలన్నా కోరిక తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే దీనిలో సక్సెస్ అవ్వాలంటే క్రమశిక్షణ ఒక్కటే సరిపోదు. పరిసరాలు, అలవాట్లు కూడా మార్పు చేసుకోవాలి. రెగ్యులర్​గా అల్పాహారం తీసుకోవడం, ఆహార సమయాలు, ముందుగా నిర్ణయించిన స్నాక్స్ తీసుకోవడం వంటి ప్లాన్ ఉండాలి. అలాగే నచ్చిన ఫుడ్స్ పూర్తిగా మానేయకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి. మనసు దానిపైకి వెళ్లకుండా ఉంటుంది. నిద్రలేచిన వెంటనే నీరు తాగడం, కాల్స్ మాట్లాడేప్పుడు నడవడం, నిద్ర కోసం హెర్బల్ టీ తాగడం వంటి చేయాలి. ఇవి మానసిక పరిస్థితి దెబ్బతినకుండా హెల్ప్ చేస్తాయి. 

జీవనశైలి మార్పులే కాదు సప్లిమెంట్స్ కూడా 

బరువు తగ్గాలనుకున్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. డైట్​లో భాగంగా పోషకాల కొరత ఏర్పడి నీరసం రావచ్చు. ఆ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ చిన్న మార్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవన్నీ మీకు బరువు తగ్గాలనే కోరికను తగ్గిపోకుండా చేస్తాయి. అలాగే యాక్టివ్​గా ఉంచుతాయి. ఎప్పుడైనా కొత్త అలవాటు చేసుకోవాలనుకున్నప్పుడు పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవాలి. అలాగే ఎక్కువకాలం కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉంటే ఒకేసారి బర్స్ట్ అయి మొత్తానికి బ్రేక్ చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే కొద్ది మోతాదులో తీసుకుంటూ క్రేవింగ్స్ అదుపులో ఉంచుకోవాలి.